శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగసముద్రం బాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి 28 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. నిర్ణీత ప్రమాణాల మేరకు త్రాగునీరు ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ గా గ్రామాలకు పంపిణీ చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఉన్న సిబ్బంది ప్రమాణాల ప్రకారము నీటిని ఫిల్టర్ చేయకుండా రిజర్వాయర్ నుండి డైరెక్ట్ పంపింగ్ ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తుండడంతో , అపరిశుభ్రమైన నీరు మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇంటింటికి అందడంతో, వివిధ గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కలుషితమైన నీరుని త్రాగటం వలన ప్రజలు టైఫాయిడ్ , మలేరియా లాంటి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.
వనపర్తి జిల్లా మిషన్ భగీరథ అధికారులు శ్రీరంగాపూర్ మిషన్ భగీరథ ఫిల్టర్ కేంద్రం పై ప్రత్యేక దృష్టి వహించి ప్రజలకు సురక్షితమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాలు కాపాడలని ఉమ్మడి మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నారు.వనపర్తి జిల్లా మిషన్ భగీరథ అధికారులు శ్రీరంగాపూర్ మిషన్ భగీరథ ఫిల్టర్ కేంద్రం పై ప్రత్యేక దృష్టి వహించి ప్రజలకు సురక్షితమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాలు కాపాడలని ఉమ్మడి మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.