A place where you need to follow for what happening in world cup

అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్ లో జోష్

0 2,601
  • హుజరాబాద్ ప్రణవ్, చొప్పదండి మేడిపల్లి, హుస్నాబాద్ పొన్నం
  • కరీంనగర్ పై కొనసాగుతున్న సస్పెన్స్

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండో జాబితాను ఏఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఒడితల ప్రణవ్ బాబు, చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిగా మేడిపల్లి సత్యం, హుస్నాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ ల పేర్లను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ జాబితాను వెల్లడించారు. హుజరాబాద్ నియోజకవర్గం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సైతం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా సింగాపురం రాజేశ్వరరావు మనవడు ఒడితెల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేరుగా ఎఐసిసి నాయకులే ప్రాణాలతో చర్చలు జరిపి సీటుపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండవ జాబితాలో యువ నేత ప్రణవ్ పేరు ఖరారు కావడంతో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

చొప్పదండి నియోజకవర్గం నుండి మేడిపల్లి సత్యం పేరు మొదటి జాబితాలో లేకపోవడంతో ఇన్ని రోజులుగా ఆయన టెన్షన్ కు గురయ్యారు. తన పేరు ఖరారు అవుతుందా లేక అధిష్టానం ప్రత్యామ్నాయం పైపు ఆలోచిస్తుందా అన్న చర్చ జోరుగా సాగింది. ఎట్టకేలకు రెండో జాబితాలో మేడిపల్లి సత్యం పేరు ఖరారు కావడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పటికే గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ప్రచారం చేశారు. సీటు ఖరారు కావడంతో మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గ నుండి పొన్నం ప్రభాకర్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం పొన్నం వైపే మొగ్గు చూపింది.

దీంతో అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తారా లేక ప్రవీణ్ రెడ్డి మరి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో అధిష్టానం రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా, నామినేషన్ల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థి పేరు ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్ ఆశావాహులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా కొత్త జైపాల్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. రాజకీయ సమీకరణాలు పరిశీలిస్తూ సామాజిక కోణంలో ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అంటూ ఆరా తీస్తుంది. ఇప్పటివరకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలు కాకపోగా ఇప్పటికీ అభ్యర్థుల వేటలోనే ఉండడంతో అధికార బిఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తున్న ప్రచారం జోరుగా సాగుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Epaper

X