A place where you need to follow for what happening in world cup

రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్

Congress and BRS fight On Rythubandhu

ఎన్నికల ముందు రైతుబంధు జమ చేయాలని మాణిక్​ఠాక్రే లేఖ
రైతుబంధు దుబారా అంటూ ఉత్తమ్ పాత వీడియోలు
ఎన్నికల వేళ తెరపైకి తెచ్చిన బీఆర్ఎస్​
డైవర్షన్​పాలిటిక్స్​అంటూ విమర్శలు
హస్తం నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ పిలుపు

ఎన్నికల ముందు రైతు సెంటిమెంట్​రాజకీయాలకు తెర లేపారు. గతంలో మాదిరిగా ఈసారి కొంత ముందుగా రైతుబంధు విడుదల చేయాలని, ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ నాటికి పెట్టుబడి సాయం పంపిణీ పూర్తి చేయాలని, దీనిపై అధికార బీఆర్ఎస్​పార్టీకి ఆదేశాలివ్వాలని కాంగ్రెస్​రాసిన లేఖపై రెండు పార్టీ మధ్య వివాదం రాజుకుంది. ఈ లేఖ ఆధారంగా కాంగ్రెస్​రైతు వ్యతిరేకి అంటూ బీఆర్ఎస్​పార్టీ రచ్చ చేస్తోంది. తాము రైతుబంధు ఆపాలని కాదని, ఎన్నికల సమయంలో పంపిణీ చేస్తే ప్రలోభాల తరహాలో ఉంటుందని, అందుకే ముందుగా పంపిణీ చేయాలని ఈసీని కోరామంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఇదే సమయంలో రైతు బంధు దుబారా అంటూ ఎప్పుడో ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారని మంత్రి హరీశ్​రావు ఓ వీడియోను విడుదల చేశారు. దీనిపై కాంగ్రెస్​ను కార్నర్ చేస్తూ.. బీఆర్ఎస్​ నిరసనలకు పిలుపునిచ్చింది. అసలే ఓవైపు మేడిగడ్డ అంశంలో బీఆర్ఎస్​ఎటూ సమాధానం చెప్పలేక దాటవేస్తున్న ధోరణి ప్రదర్శిస్తుండగా.. కాంగ్రెస్ పై రైతుబంధు అస్త్రాన్ని తీసుకువచ్చి డైవర్శన్​ పాలిటిక్స్​చేస్తుందనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

మేమలా అనలేదు..
రైతుబంధు పంపిణీపై తమ పార్టీ ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయలేదని, నవంబర్ 3 వరకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీని కోరామంటూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రేతోపాటుగా టీపీసీసీ చీఫ్​రేవంత్, ఎంపీలు ఉత్తమ్, వెంకట్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందంటూ విమర్శించారు. ఈసీకి దీనిపై రాసిన లేఖను కాంగ్రెస్ మరోసారి విడుదల చేసింది. గతంలో మాదిరిగా పోలింగ్ రోజు కాకుండా నామినేషన్లకు ముందు రైతు బంధు డబ్బులు అకౌంట్లలో వేయాల్సిందిగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించామని ఎన్నికల కమిషన్ ను కోరినట్లు పేర్కొంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలంటే ఇది అవసరమని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది.

బీఆర్ఎస్​ఎదురుదాడి..
రైతుబంధు రైతులకు అందకుండా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. మంత్రి కేటీఆర్​తోపాటుగా హరీశ్​రావు, కవిత, ఇతర మంత్రులు మూకుమ్మడిగా కాంగ్రెస్​పై విమర్శలు సంధిస్తున్నారు. రైతుబంధును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని, రైతు వ్యతిరేకి అంటూ వెంటనే ప్రచారానికి దిగారు. కేవలం రాష్ట్ర నేతలకే పరిమితం చేయకుండా.. రాహుల్​గాంధీపైనా బీఆర్ఎస్​ఆరోపణలు చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో నిరసనలు తెలుపాలని, కాంగ్రెస్​ నేతలను నిలదీయాలని, ఆ పార్టీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలంటూ కేటీఆర్​పిలుపునిచ్చారు.

పాత వీడియో దొరికింది..
ఇదే సమయంలో రైతులపై కుట్ర చేస్తున్నారంటూ మంత్రి హరీశ్ రావు ఏకంగా ఓ వీడియోను బయటకు విడుదల చేశారు. ఉత్తమ్​కుమార్​రెడ్డి చెబుతున్నారని, రైతుబంధు దుబారా పథకం అంటూ ఉన్న వ్యాఖ్యలతో ఉన్న వీడియోను షేర్​ చేశారు. రైతుబంధు పథకం ఫార్మర్స్ ఇన్​పుట్​సబ్సిడీ పథకం మొదలుపెట్టారని, తెలంగాణ ప్రజల అమూల్య సొమ్ము, పన్నుల ద్వారా చెల్లిస్తున్న పైసలను దుబారా చేస్తున్నారంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖలను మంత్రి హరీశ్​వినిపించారు. వీటితోపాటుగా రైతులకు మూడు గంటల విద్యుత్​ అంటూ గతంలో రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు పెంచారు.

డైవర్శన్ కోసమేనా?
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు అంశం వివాదంగా మారడంతో, కాంగ్రెస్​పెద్ద ఎత్తున దీనిపై ఆందోళనలు చేస్తోంది. ఈక్రమంలో అధికార పార్టీ ఒక్కసారిగా పాత వీడియోలన్నీ సోషల్ మీడియాతోపాటుగా మీడియాకు పంపించి, విమర్శలకు దిగుతున్నారు. కాళేశ్వరం ఇష్యూను పక్కకు తప్పించేందుకే బీఆర్ఎస్​ఈ పాత వీడియోలను తెరపైకి తెచ్చిందంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.