20 ఏళ్ల సమస్య సంవత్సరంలో పరిష్కరించిన ఎమ్మెల్సీ
జమ్మికుంట: జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ సమస్యను పరిష్కరించలేకపోయాడని ఎమ్మెల్సీగా వచ్చిన సంవత్సరంలోనే మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో సైదాబాద్ ప్రజలందరూ ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు.