A place where you need to follow for what happening in world cup

కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్ ఫాస్ట్

  • దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ
  • ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడాలేదు
  • సిఎం బ్రేక్ ఫాస్ట్ తో విద్యావ్యవస్థలో సమూల మార్పులు
  • ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 48 వేల 408 మంది విద్యార్థులకు లబ్ది
  • స్కూల్స్‌లో డ్రాప్‌ ఔట్స్ తగ్గించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు కు బ్రేక్ ఫాస్ట్ పదకం నాంది ప్రజల బాధలు తెలిసిన నాయకుడు కేసీఆర్

సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ముఖ్య మంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి కార్యక్రమం లో పాల్గొన్న ఎంపి బడుగుల, కలెక్టర్ వెంకట్రావు అడిషనల్ కలెక్టర్ ప్రియాంక, డి.ఈ.ఓ అశోక్, మున్సిపల్ చైర్మన్ పరిమాల అన్నపూర్ణమ్మ, కమీషనర్ రామానుజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకమని సూర్యాపేటశాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ జగదీష్ రెడ్డి గారు పేర్కొన్నారు.సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ముఖ్య మంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మాట్లాడుతూ,దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు.ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడాలేదన్నారు. సిఎం బ్రేక్ ఫాస్ట్ తో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందని, స్కూల్స్‌లో డ్రాప్‌ ఔట్స్ తగ్గించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు కు బ్రేక్ ఫాస్ట్ పదకం నాంది పలకనుందని మంత్రి తెలిపారు.

ఈ పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలో 67,255 మంది విద్యార్థులకు , ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 48 వేల 408 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. వెయ్యి గురుకులాలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజలు అడిగినా అడగకపోయినా ,ఏ వర్గానికి ఏమి కావాలో తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీలకతీతంగా రాజకీయాలకు కచ్చితంగా ఎన్నికలకు సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే అని కొనియాడారు.

ఒక పథకం అమలుచేసే ముందు కుటుంబ పెద్దగా తండ్రి ఎలా ఆలోచిస్తారో అదే కోణంలో ఆలోచిస్తారని చెప్పారు. అందుకే అవి విజయవంతం అవుతున్నాయని, సామాజిక మార్పునకు కారణమవుతున్నాయని తెలిపారు. సీఎం బ్రేక్ఫాస్ట్ విద్యార్థుల కడుపు నింపడమే కాదు , పనులకు వెళ్లే లక్షలాదిమంది తల్లులకు ఆసరా అని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఎల్పారం విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు కావలసిన పోషకాలు ప్రోటీన్లు, విటమిన్ల సమ్మేళనంతో బ్రేక్ ఫాస్ట్ ను అందించనునట్లు తెలిపారు.
అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ మంత్రి బ్రేక్ ఫాస్ట్ చేశారు

Leave A Reply

Your email address will not be published.