విరిగి పడడంతో 107కు పైగా మంది మృతి…పలువురు గల్లంతు
రెస్క్యూ కోసం కేంద్ర సాయం కోరిన కేరళ ప్రభుత్వం
వయనాడ్ విషాదంపై రాహుల్ ఆవేదన…
అదనపు పరిహారం అందించాలని లోక్‌సభలో వినతి
సహాయక, రెస్క్యూ చర్యలు ముమ్మరం
బారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం
వయనాడ్‌లో విషాదంలోపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దాదాపు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. అదనపు పరిహారం అందించాలని కోరారు. వయనాడ్ విషాదంపై మంగళవారం లోక్‌సభలో చర్చకు వొచ్చింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై మాట్లాడుతూ…వయనాడ్‌లో పలుమార్లు కొండచరియలు విరిగిపడ్డాయని, ఇప్పటి వరకు దాదాపు 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయయని, ముండకై గ్రామంలో నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని తెలిపారు. రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో తాను చర్చించానని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం పెంచి పంపిణీ చేయాలన్నారు. వయనాడ్, పశ్చిమ కనుమల్లో గత కొన్నేళ్లుగా చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచి ఉందన్నారు. ఇటువంటి ఘటనలు మన దేశంలో పెరిగిపోయాయని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ విపత్తులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో వాటిని ఎదుర్కునడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.