A place where you need to follow for what happening in world cup

ఉదయనిధి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి స్పందించాలి

0 124

మంత్రి హోదా లో ఉదయనిధి సనాతన ధర్మం నిర్మూలించాలని వ్యాధుల తో పోల్చి హిందువులను అవమాన పర్చారని బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. సోమ వారం అయన మీడియాతో మాట్లాడారు. వారిని సమర్ధించింది కొన్ని పార్టీలు, నేతలు 100 కోట్ల హిందువులను అవమానించారు. రేవంత్ స్టాలిన్ వ్యాఖ్య లను తప్పు కూడా పట్టలేదు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ వైఖరి. కాంగ్రెస్ వైఖరి పై ప్రజలు ఆలోచన చెయ్యాలి. గజినీ నుంచి ఔరంగ జేబు లు, షాజహాన్ , నిజాం , రజాకార్లు, మజ్లీస్ లు ఎవరు దాడి చేసినా, గుడులు, గోపురాలు, హత్య లు చేసినా ధర్మం పెరుగుతూనే ఉన్నది. తమిళనాడు , భారత చరిత్ర వేర్వేరు కాదు. తమిళనాడు నుంచి తూర్పు దేశాల వరకు వేలాది సంవత్సరాలు సనాతనం కొనసాగుతున్నది.

మూర్ఖంగా మాట్లాడే యువ మంత్రి నీ ప్రభుత్వ చిహ్నాన్ని తొలగించి చూడు. యీ ధర్మం పట్ల ఈర్ష్యా ,ద్వేషం ఉంటే ఆలయాలు మఠాల కు అప్పగిస్తవా అని అన్నారు. దేవాలయాల అదాయల తో ఖజానా నింపుకుంటున్నవ్. సనాతన ధర్మం పాటించే వారి ఓట్ల అక్కరలేదు అని చెప్పే దమ్ముందా. మీ తల్లి, నానమ్మ పాటించారు కదా.. వాళ్ళను కూడా నాశనం చేస్తావా దమ్ముందా? రేవంత్ ఎందుకు స్పందించలేదు.. ఇండియా a కూటమి లో ఉన్నారు కదా. తెలంగాణ లో హిందువులు, సనాతన ధర్మం ఆచరించే ప్రజలు ఆలోచన చెయ్యాల్సిన సమయం ఇది. సెక్యులర్ ముసుగు లో హిందూ వ్యతిరేక పెంచింది కాంగ్రెస్. 15 నిమిషాల్లో హిందువులను నిరుములిస్త అన్న మజ్లీస్ తో అంట కాగింది కాంగ్రెస్. అయోధ్య రామ మందిరం వ్యతిరేకించింది కాంగ్రెస్. మైనారిటల ఓట్ల కోసం దిగజారే పార్టీ కాంగ్రెస్. కర్ణాటక లో ఓట్ల కోసం బాజరంగ్ దల్ ను నిషేదిస్త అన్నది. కాంగ్రెస్ సాఫ్రాన్ టెర్రరిజం అనే పేరు కాంగ్రెస్ తెచ్చింది.

ప్రపంచం ఇస్లామిక్ టెర్రరిజం తో బాధ పడుతుంటే ఓట్ల వేట లో కాంగ్రెస్ ఉంది. బాంబు లు పేల్చే వారి మీద సన్నాయి నొక్కులు నొక్కేది కాంగ్రెస్. మీ ఆటలు సాగవ్.. సర్వేజనా సుఖినోభవంతు అనే ధర్మాన్ని నాశనం చేస్తా అంటారా. ఉదయనిధి క్షమాపణ చెప్పాలి లేదంటే దేశం మొత్తానికి వాళ్ళు  మూల్యం చెల్లిస్తారు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనగానే దడుచుకుంటున్నరు కాంగ్రెస్ నేతలు. అజెండా రాకముందే ఊహాగానాలు తో భయం, అభద్రత, గుబులు.. కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రజల చేత తిరస్కరించి న పార్టీ ల కూటమిలకు మోడీ హటావో తప్ప అజెండా లేదు.. జమీలీ ఎన్నకల్ అంటే గుబులు దేనికీ. మోడీ చరిష్మా, అజెండా, ప్రజల పరిపాలన వల్ల భయం మీకు.

కమిటీ నివేదిక కు అరు నెలల సమయం పడుతుంది భయం, అభద్రత దేనికని ప్రశ్నించారు. నెహ్రూ కాలం లో జమిలి జరిగితే లేని భయం ఇప్పుడే దేనికీ. అప్పుడు నెహ్రూ చేసింది తప్పేనా ఒప్పుకుంటారా. ప్రజల కోసం, సమయం, డబ్బులు వృధా కాకుండా ఉండటం కోసం ఆలోచన చేస్తే దేనికీ భయం. వేలాది కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా కర్చు అవసరమా. అధిర్ రంజాన్ కు సభ్యత్వం ఇస్తే దేనికీ భయపడ్డారు. గతం లో జమిలే  జరిగితే స్వయం ప్రతిపత్తి  దెబ్బతిన్నదా? దక్షిణాది మీద దాడి జరిగిందా? ఏది ఊహాజనితంగా ఉండదు…పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఎంపీ గతం లో జమిలే మంచిది అన్నారు ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారు.. ఊహకు అందనిది ప్రత్యేక సమావేశాలు,  దేశం కోసం చర్చ జరుగుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.