A place where you need to follow for what happening in world cup

ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మండిపాటు

0 38

ఎంపీ కోమటిరెడ్డి పైన కాదు ఆయన తమ్ముడు లాంటి నాపైన నిలబడి గెలవు దమ్ముంటే:సోమవారం జరిగిన ప్రగతి నివేదన సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని చేతనైతే సూర్యాపేటలో తనపై పోటీ చేసి గెలవాలని టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సవాల్ విసిరారు మంగళవారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ మొక్కుబడిగా ఇచ్చిన దళితబందు చెక్కులు మాత్రమే కాదు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న అందరు దళితన్న కుటుంబాలకు దళితబందు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికలకోసం తాత్కాలిక తాయిలాలు ఇచ్చేది కాదని పెయిడ్ ఆర్థికల్స్ కాదు, పెయిడ్ వ్యక్తుల స్టేట్ మెంట్స్ కాదు చెయ్యాల్సిందనిర్ గృహలక్ష్మి, దళితబందు అందరికి ఇవ్వాలనీ అలాగే దళితబందు, గృహలక్ష్మి లబ్ధిదారులకు చేరాలంటే బి ఆర్ ఎస్ నాయకుల చేతులు 30% కమిషన్లలతో తడపాల్సివాస్తోందని లబ్ధిదారులు బోరుమంటున్నారనీ ఆరోపించారు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల వ్యక్తిత్వం, అనుభవంలో అణుమాత్రం సరిపోలరని, వారి కాలి గోటికి సరిపోలని స్థాయి కేటీఆర్ ది జగదీశ్వర్ రెడ్డి ది అన్నారు.

గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో గెలిచిన మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఈసారి డిపాజిట్ కూడా దక్కదన్నారు.తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనలో భాగంగా మంత్రి పదవిని తృణపాయంగా భావించి నిరాహారదీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి కి డిపాజిట్ కూడా దక్కదనే భయంతోనే ఎంపీ కోమటిరెడ్డి పై అర్థంలేని ఆరోపణలు కేటీఆర్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజల కోసం తీసుకొస్తుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ బి. ఆర్. ఎస్ తాబెదార్ల కోసమే అని విమర్శించారు త్యాగాలు చేసింది విద్యార్థులు తెలంగాణా సకలజనులు, కాంగ్రెస్ పార్టీ కానీ నేడు భోగాలు అనుభవించేది మాత్రం బి. ఆర్. ఎస్. నాయకులు అనే ఎద్దేవా చేశారు పదవుల కోసం పంపకాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు కేటీఆర్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అని విమర్శించారు ఎన్నికల వ్యవస్థను, రాజకీయాలను బ్రష్టు పట్టించింది బిఆర్ఎస్ నాయకులు అని ఆరోపించారు ఎంపీటీసీలకు ఒక రేటు సర్పంచులకు ఒక రేటు అంటూ కొనుగోలు చేసి రాజకీయాలంటే కొనడం అమ్మడమే అని బీ ఆర్ఎస్ నాయకులు భావించడం సిగ్గుచేటు అన్నారు.

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఇచ్చి కొనుగోలు చేసి రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ రంగాన్ని దిగజార్చింది సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు మచ్చలేని నాయకుడు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ని విమర్శిస్తే టిఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తిరగనియం ఖబర్ధార్ అన్నారు సూర్యాపేటలో వేల కోట్లతో అభివృద్ధి అంటున్నారు ఇదే అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి లేదా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో భారీ అవినీతికి పాల్పడి వేలకోట్ల రూపాయల అక్రమ సంపాదనతో అహంబావిగా మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారనీ జోష్యం చెప్పారు వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఎన్నో ఆటుపోట్లను చవి చూసిందని ఏ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొగలిగే శక్తి సామర్థ్యం, ప్రజాధరణ కార్యకర్తల బలం ఉండి నిలబడి గెలిచిన గెలిచే పార్టీ కాంగ్రెస్ అన్నారు. సూర్యాపేట రూరల్ మండలం రామచంద్రపురం బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు కర్ర అశోక్ రెడ్డి బిజెపికి రాజీనామా చేసి తన కార్యకర్తలతో రమేష్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ ఉపేందర్ ఫరూక్ నామ అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Epaper

X