తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అనకాపల్లి పట్టణంలో మాజీ టిడిపి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దీనికి జనసేన నాయకులు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు మద్దతుగా గలం కలిపారు. చంద్రబాబు నాయుడు పై బురదజల్లే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేపట్టాడని దీన్ని అందరూ తిప్పుకొట్టాలని గోవిందు పిలుపునిచ్చారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేయాలని ఆయన పై పెట్టిన కేసుల్ని కొట్టివేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పై అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు పై కక్షపూరిత రాజకీయం చేయడం అన్యాయమని రానున్న రోజుల్లో ప్రజల బుద్ధి చెప్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.