బీజేపీ నాయకులందరూ 24 గంటల ఉపవాస దీక్షలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు.. తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారు. వారికి సంఘీభావంగా బీజేపీ దీక్ష చేస్తున్నది.తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాటం చేసింది రాష్ట్ర నిరుద్యోగ యువత. 9 ఏండ్లుగా నిరుద్యోగ యువత విషయంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వహించిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు ధర్నా చౌక్ లో 24 గంటల ఉపవాస దీక్షలో అయన పాల్గోన్నారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ 1969లో తెలంగాణ యువత ఉద్యోగాలు, భవిష్యత్ విషయంలో అనేక పోరాటాలు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసు తూటాలకు 369 మంది బలయ్యారు.
ఆరోజు కాల్చి చంపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు, విద్యార్థులు చదువు మానేసి.. మాకు తెలంగాణ కావాలి, ఉద్యోగాలు కావాలని పోరాటం చేశారు. తెలంగాణ రాదేమోనని,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదేమోనని 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారు. కానీ ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల.. కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి.ట్యాంక్బండ్పై మిలియన్ మార్చ్, సాగరహారం, వంటావార్పు.. ఇదే ధర్నా చౌక్లో ఏండ్ల తరబడి నిరుద్యోగులు పోరాటం చేశారు.
కానీ తొమ్మిదేండ్లుగా నిరుద్యోగ యువత పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. యూనివర్సిటీలు కళావిహీనంగా ఉన్నాయి. హాస్టళ్లలో పందికొక్కులు తిరుగుతున్నాయి. తెలంగాణ వస్తే.. వర్సిటీల్లో ఖాళీ లెక్చరర్ల పోస్టులు, స్కూళ్లు, కాలేజీల్లో టీచర్ల పోస్టులు భర్తీ అవుతాయని, తమకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. డ్ల తరబడి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసులతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.టీచర్ పోస్టులు 25 వేలు ఖాళీలు ఉన్నాయి కదా? ఏమైంది? తొమ్మిదేండ్లుగా డీఎస్సీ వేయలేదు ఈ ప్రభుత్వం.. ఈరోజు ఏ మొహం పెట్టుకొని గ్రామాలకు వస్తారు.. కేసీఆర్. మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు
లేదని అన్నారు.