టీఎస్ టెట్ హాల్‌టికెట్లు ఈ నెల 15న జరుగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న పరీక్షా కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న టెట్ పరీక్ష జరుగునుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగనున్నది. అయితే, పరీక్షా కేంద్రాలను పలు పాఠశాలల్లో ఆయా పాఠశాలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ నెల 14న హాఫ్ డే ఇవ్వగా.. పరీక్షా రోజైన 15న సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు ఒకటిన విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా..
2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.టెట్ అభ్యర్థులకు సూచనలు
· టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలి.
· పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, డిసేబిలిటీ తదితర వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి.హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా లేకపోతే అభ్యర్థుల ఇటీవలి తాజా ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకొని, ఆధార్ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో పర్మిషన్ అనంతరమే పరీక్షకు అనుమతించడంలో తగు నిర్ణయం తీసుకుంటారు.పరీక్షాకేంద్రం చిరునామాను ఒకరోజు ముందుగానే సంప్రదించడం ఉత్తమం.