కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి. ఖుతుబొద్దిన్ పాషా
కోరుట్ల:గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగి రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై ‘స్టే’ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం బీజేపీకి చెంపపెట్టు లాంటిదని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రెండేళ్ల జైలు శిక్షపై స్టేను విధిస్తూ ఆదేశాలు ఇచ్చిందని, ఈ సందర్బంగా విద్వేషంపై ప్రేమ విజయం సాధించినట్లు అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఆది నుంచి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీకి సరైన గుణపాఠం చెబుతామన్నారు. కాగా సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
న్యాయం గెలిచిందని, బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తు అయ్యాయని అన్నారు. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేయించారని మండిపడ్డారు. అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయించారని, ఇవి దుర్మార్గపు చర్యలని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ నిర్ణయంతో చట్టం, న్యాయంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీకి అండగా నిలిచారని అన్నారు. రానున్నా ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ది చెపుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ యూత్ నాయకులు ముద్దం ప్రశాంత్, కోరే రాజకుమార్,ఘని సింగ్,ఎండి. అన్వర్ తదితరులు పాల్గొన్నారు