సంగారెడ్డి:ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో మరోసారి విషాదం నెలకొంది. క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. క్యాంపస్ రూమ్ లో విద్యార్థిని మమైతా నాయక్ (21) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కార్తీక్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది.
గత నెల 17 న కార్తీక్ విశాఖపట్నం బీచ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది వ్యవధిలో నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే మొదటిసారి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడికి గురవుతున్నానని మృతురాలు లేఖ రాసినట్లు సమాచారం.