A place where you need to follow for what happening in world cup

ఔటర్ చుట్టూ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్

0 75

మహానగర మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డుకు మరింత సొబగులిచ్చేందుకు మరో ముత్యం చేరబోతుంది. అదే అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్. ఓఆర్ఆర్ వెంట 23 కిలోమీటర్ల దేశంలోనే అతిపొడవైన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నగర కాలుష్య రహిత యాక్టివ్ మొబిలిటీలో భాగంగా ఐటీ కారిడార్ లో సైక్లిస్టులకు ఉపయోగపడేలా అత్యాధునికి వసతుల సైకిల్ ట్రాక్ గెట్ రెడీ అంటోంది.నగరంలో వాహనాలతో నిండిన నిత్య రద్దీ రోడ్లపై సైకిల్ సవారీ ఓ సవాలు. ఫిట్ నెస్, పర్యావరణహిత, యాక్టివ్ మొబిలిటీలో భాగమైన సైకిల్ రైడ్ కు యువత మొగ్గుచూపుతున్న తరుణంలో దానికి అనువైన ట్రాక్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం ప్రభుత్వం ఓఆర్ఆర్ వెంట ఓ అద్భుతాన్నే ఆవిష్కరించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో 23 కిలోమీటర్ల పొడవైన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణం చేసింది. ఓ నెటిజన్ ట్వీట్ తో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఔరా అనిపించే సైకిల్ ట్రాక్ రెడీ అయిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐటీ కారిడార్ లో నానక్ రాంగూడ్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ నుంచి తెలంగాణ పోలీస్ అకడామీ వరకు 8.5 కిలోమీటర్లు, మరోవైపు నార్సింగ్ నుంచి కొల్లురు వరకు 14.5 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ తో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసింది. తుది మెరుగులతో ఓపెనింగ్ కు రెడీ అయింది ఈ ట్రాక్. ఓఆర్ఆర్ వెంట ఇప్పటికే ఎయిర్ పోర్టు మెట్రో, వాటర్ రింగ్ మెయిన్ వంటి కీలక ప్రాజెక్టులు వస్తున్నాయి.వాటికి తోడు ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ తోడవడంతో మణిహారంలాంటి ఓఆర్ఆర్ లో మరిన్ని ముత్యాలు పొదిగినట్లు అవుతుందని అంటున్నారు. సైక్లిస్టులు సురక్షితంగా ప్రయాణించే మార్గంతో పాటు పైన ఉన్న సోలార్ ప్లేట్లతో దాదాపు 16 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఉత్పత్తి చేసిన కరెంట్ ను ఓఆర్ఆర్ వెంట్ డ్రిప్ ఇరిగేషన్, స్ట్రీట్ లైట్ల కోసం వినియోగించాలని హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది.

90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ట్రాక్ ను ఆగస్టు 15కు ప్రారంభించాలని అనుకున్నా.. పనులు పూర్తి కాకపోవడంతో సెప్టెంబర్ మొదటి వార్ంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.24 గంటల ఫెసిలిటీ.. 23 కిలోమీటర్ల స్ట్రెచ్.. 4.5 మీటర్ల వెడల్పు.. 3 వరసల్లో సైకిళ్లు వెళ్లేలా ట్రాక్. ఇది ఈ సైకిల్ ట్రాక్ రిక్డార్డు. విదేశాల్లో ఇలాంటి ట్రాక్స్ ఉండగా అక్కడ ఆఫీస్ ల సమీపంలో ఇళ్లు ఉంటే సైకిల్ మీదే ఆఫీస్ కు వెళ్లేలా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఐటీ కారిడార్ లో ఈ ట్రాక్ ఏర్పాటు చేయడం వెనక వాక్ టూ వర్క్స్ కాన్సెప్ట్ తో ఇంటి నుంచి సైకిల్ పైనే ఆఫీస్ కు వెళ్లాలని ఈ ట్రాక్ అందుబాటులోకి తెచ్చామని అంటోంది హెచ్ఎండీఏ. సైక్లింగ్ అంటే ఇష్టపడే వాళ్లు, ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ చేసే వాళ్లతో పాటు ఆఫీస్ లకు వెళ్లడానికి కూడా ఇది డబల్ యూజ్ కానుంది.

సైకిల్‌ ట్రాక్‌ మార్గంలో ప్రతి కిలోమీటర్ దూరాన్ని సూచించేలా గుర్తులను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు మీటింగ్‌ పాయింట్లు, ట్రాక్‌ కలరింగ్‌, భద్రతా పరమైన చిహ్నాలు, విద్యుద్దీపాలు, ఇతర భద్రతా పరమైన ఏర్పాట్లు ఉంటాయని, ప్రధానంగా సైకిల్‌ ట్రాక్‌పైకి ఇతర వాహనాలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీని వల్ల ఎలాంటి ప్రమాదాలకు చోటు ఉండదన్నారు. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లోనూ సైక్లింగ్‌ చేసేందుకు వీలుగా విద్యుత్‌ దీపాలతో వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేశారు.ఢిల్లీ కాలుష్యం, బెంగళూరు ట్రాఫిక్ వంటి పరిస్థితులను ఇతర నగరాలకు వేగంగా విస్తరిస్తున్న వేళా ఇలాంటి యాక్టివ్ మొబిలిటీ ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంతో అవసరమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. నగరంలో పలు చోట్ల సైకిల్ ట్రాక్ లు ఉన్నా వాటిని ఉదయం 8 దాటింది అంటే వాహనాలు కబ్జా చేస్తున్నాయి. ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ సపరేట్ గా ఉండటంతో అలాంటి ఇబ్బందులు ఉండవని… ప్రభుత్వ కృషికి సైక్లిస్టులు అభినందనలు తెలుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.