ఎమ్మార్పీఎస్ నాయకుడు యాతాకుల భాస్కర్ బీఆర్ఎస్ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్య్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మేల్యే ఉపేందర్ పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ దళిత జాతి మేలు కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. * దళితజాతి అభివృద్ధి కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు భాస్కర్ ను ఆకట్టుకున్నాయి. ఎన్నికలు రాగానే పార్టీలు నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయి. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలు నిజం చేసే పార్టీ బీఆర్ఎస్. నకీలు మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువయ్యాయి. అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదు.
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోయారు. అమిత్ షా గుజరాత్ గుడ్డి పాలనను సరిచేసుకోవాలి. ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో హామీలు అమలు కావడం లేదు. కర్ణాటకలో బీజేపీపై ప్రజలకు కక్కోస్తే కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదు…సొల్యూషన్ సర్కార్. అంబేడ్కర్ ఓవర్ సిస్ స్కాలర్షిప్ కింద దళితులకు 20లక్షలు కేసీఆర్ సర్కార్ ఇస్తోంది. రెసిడెన్షియల్ స్కూల్స్, 80కి పైగా మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టిన సర్కార్ కేసీఆర్ ది. 12వందల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిన ఏకైక సర్కార్ కేసీఆర్ దని అన్నారు