జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జగిత్యాల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టులలో 9 సెప్టెంబర్ 2023 రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని
జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ జగిత్యాల, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు..
ఈ జాతీయ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు (దావాలు), కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన చట్టంకు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు, చిట్ ఫండ్ కేసులు ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడునని కావున కచ్చిదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
9 సెప్టెంబర్ 2023 రోజున నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలతో మీ యొక్క కేసులు పరిష్కరించుకోగలరని జిల్లా న్యాయమూర్తి నీలిమ కోరారు.