భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ర్ట కార్యవర్గ (జిల్లా,మండల అధ్యక్షులు)సమావేశాన్ని కొంపల్లి లోని ఏఎంఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఓబీసీ మొర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా” లక్ష్మణ్.బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి దేశం గర్వించ దగ్గ స్థాయి కి వెళ్ళిన బిసి బిడ్డ నరేంద్ర మోడీ అని అన్నారు.
బిసిలకు ,ఎస్సీలకు సబ్ ప్లాన్ అమలు చేసి వారి జీవితంలో వెలుగులు నింపాలని మొట్ట మొదట ప్రతిపాదన పెట్టింది బిజెపి పార్టీ అని అన్నారు. బిసి లకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బి అర్ ఎస్ పార్టీ వారి అభివృద్ధి ని గాలికి వదిలేసింది అని మండిపడ్డారు. అన్నిట్లో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ…అని చెప్పే కేసీఆర్ కు నంబర్ వన్ అంటే మధ్యంలో, భూ కబ్జాల్లో,లిక్కర్ స్కాం లలో,ప్రభుత్వ భూములు కొల్లగొట్టడం లో,ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడంలో అని మండిపడ్డారు.