A place where you need to follow for what happening in world cup

వివాదాల సుడిగుండంలో ములుగు కలెక్టర్..

  • ఇసుక మాఫియాను అరికట్టడంలో వైఫల్యం
  • ఫిర్యాదులను పట్టించుకోని వైనం
  • పత్రికా కథనాలకూ స్పందించని నైజం
  • పైరవీ చేసిన వారికే ఇసుక అనుమతులు
  • అవినీతి అధికారుల మాటలకే పెద్ద పీట
  • మంత్రుల పేరుతో కాలయాపన
  • బదిలీ కోసం ప్రయత్నాలు

చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం, ప్రభుత్వ ప్రాధాన్యతలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం ఐఏఎస్ అధికారుల బాధ్యత. అందుకే వారికి ‘సివిల్ సర్వెంట్స్’ అని పేరు పెట్టారు. కానీ ములుగు జిల్లా కలెక్టర్ పని తీరు దీనికి భిన్నంగా ఉన్నది. జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టడంలో కలెక్టర్ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినవస్తున్నాయి. జిల్లా ఇసుక కమిటీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న కలెక్టర్ పలు సందర్భాల్లో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రస్తుత కలెక్టర్ కన్నా ముందుగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కృష్ట ఆదిత్య ఇసుక మాఫియాపై కొరఢా ఝుళిపించగా ప్రస్తుత కలెక్టర్ దీనికి భిన్నంగా మాఫియా పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తూ కొండంత అపఖ్యాతి మూటకట్టుకున్నారు. ఇసుక అక్రమాలపై స్వతంత్రంగా వ్యవహరించకుండా అవినీతికి కేరాఫ్ గా మారిన మైనింగ్, టీఎస్ఎండీసీ అధికారుల మాట వినడంతో కలెక్టర్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ప్రస్తుత కలెక్టర్ బాధ్యతలను స్వీకరించిన వెంటనే వివాదాస్పదమైన పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని ఎనిమిది పట్టా భూముల ఫైళ్లను అంతకు ముందు పనిచేసిన కలెక్టర్ కృష్ట ఆదిత్య పక్కన పెట్టారు. నది మధ్యలో ఉన్న పట్టా భూములు నది ఒడ్డున ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన తప్పడు నివేదికలపై ఆయన స్వయంగా దర్యాప్తు జరిపారు.

Mulugu Collector in disputes

జిల్లా ఇసుక కమిటీ సమావేశంలోనే ఉపగ్రహ ఛాయా చిత్రాలను ప్రదర్శించి సరిహద్దుల గురించి స్పష్టత నిచ్చారు. పట్టాదారుల పేరుతో దళారులు చేస్తున్న అక్రమాలను వివరించారు. కోర్టు కేసులను కూడా ఎదుర్కొన్నారు. కోర్టు ధిక్కార నేరం కింద పిటిషన్లు దాఖలు చేసినా వీటికి కౌంటర్ వేశారు. వెకేట్ పిటిషన్లు కూడా వేయించారు. ఈ దశలో ఆయన బదిలీ కావడంతో ఇసుక మాఫియా ఊపిరి పీల్చుకున్నది. కొత్త కలెక్టర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే మైనింగ్ శాఖ ఏడీ కూడా బదిలీ అయ్యారు. పట్టా భూములకు అనుమతులు ఇచ్చే ఫైల్ ను కలెక్టర్ క్లియర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అనుమతులు తీసుకున్న మాఫియా భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు మీడియాలో కథనాలు రావడమే కాక కలెక్టర్ కు పలు ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు.

అక్రమాలపై మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తునకు ఆదేశించడంతో దర్యాప్తు జరిగింది. ఈ దర్యాప్తు సజావుగా సాగుకుండా మైనింగ్ శాఖ అధికారి చక్కదిద్దడం హాట్ టాపిక్ గా మారింది. విజిలెన్స్ నివేదికను పంపడంలో జాప్యం జరగడం వెనుక కూడా మైనింగ్ మాఫియా హస్తం ఉన్నట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా మైనింగ్ మాఫియా మరింత చెలరేగిపోయింది. గోదావరిలో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేపట్టడం, అనుమతించిన లోతు కన్నా ఎక్కువ లోతులో తవ్వకాలు చేపట్టడం, ప్రతి లారీ వద్ద రూ. 3,500 అక్రమంగా వసూలు చేయడం వంటి అక్రమాలు కలెక్టర్ దృష్టికి వచ్చినా స్పందించలేదు.

Mulugu Collector in disputes

ఆదివాసీ సంఘాల అనుమతుల్లో కలెక్టర్ విచిత్ర విన్యాసాలు

ఆరు నెలల క్రితం కలెక్టర్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆదివాసీ సహకార సంఘాలకు సంబంధించిన 12 ఇసుక రీచ్ లకు అనుమతులు వచ్చాయి. వీటికి నిబంధనల ప్రకారం తుది అనుమతులను ఇవ్వాల్సిన కలెక్టర్ జాప్యం చేశారు. మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న సమయంలో అనుమతులు పేరుతో హడావుడి చేశారు. అనుమతుల కోసం తనను కలిసిన ఆదివాసీ సంఘాలతో కలెక్టర్ చెప్పిన విషయాలు వారికి విస్మయాన్ని గురిచేశాయి. మంత్రులను కలవాలని కలెక్టర్ స్వయంగా చెప్పడాన్ని సంఘాలు తప్పు పట్టాయి. పీసా చట్టం ప్రకారం తమకు కేటాయించాల్సిన ఇసుక రీచ్ లను కేటాయించక పోవడం పట్ల కలెక్టర్ వైఖరిని వారు తప్పుపట్టారు. కొందరు బినామీ కాంట్రాక్టర్లు ఒక మంత్రికి, మరొక మంత్రి కుమారుడికి భారీగా ముడుపులు చెల్లించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వారు సిఫారసు చేసిన వెంకటాపురం మండలంలోని మూడు, వాజేడు మండలంలోని ఒకటి, మంగపేట మండలంలోని మూడు ఇసుక రీచ్ లకు అనుమతులు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

మిగిలిన ఐదు రీచ్ లకు అనుమతులు ఇవ్వక పోవడంతో ఆదివాసీ సహకార సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ జాప్యం చేసి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ ఫైళ్లను కలెక్టర్ పక్కన పడవేశారు. రాజకీయ ఒత్తిడులతో ఏడు రీచ్ లకు అనుమతుల నిచ్చెన కలెక్టర్ తమ రీచ్ లను పట్టించు కోక పోవడంతో ఐదు రీచ్ ల సహకార సంఘాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. విషయాన్ని మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్ళారు. ఆయన కూడా దళారుల ద్వారా భారీగా ముడుపులు తీసుకుని ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని తుది ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించారు. ఇదంతా జరిగే సరికి మే నెల వచ్చేసింది. జూన్ 8 నాటికి ఇసుక రీచ్ లకు ఇచ్చిన పర్యావరణ అనుమతుల కాలపరిమితి ముగుస్తున్నది. కలెక్టర్ చేసిన జాప్యంతో తమకు వచ్చే ఆదాయం కోల్పోయామని ఆదివాసీ సంఘాలు వాపోతున్నాయి.

Mulugu Collector in disputes

కోర్టు ఉత్తర్వుల పేరుతో వక్రభాష్యం..

వెంకటాపురం మండలంలోని పూజారిగూడెం ఇసుక రీచ్ కి ఏప్రిల్ 30 న కలెక్టర్ తుది అనుమతుల నిచ్చారు. ఈ రీచ్ కి ఎటువంటి అనుమతులు ఇవ్వవద్దని జూన్ 2 న కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు ముందే అనుమతులను ఇచ్చినందున కోర్టు ఉత్తర్వులు వర్తించవని కొందరు న్యాయ వాదులు తెలిపారు. ఈ అంశంలో వెకేట్ పిటిషన్ వేయాల్సిన కలెక్టర్ తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రీచ్ అనుమతులు రద్దు చేశారని పూజారిగూడెం ఆదివాసీలు అభ్యంతరం తెలిపారు. కలెక్టర్ పై న్యాయ పోరాటం చేస్తామని వారంటున్నారు.

మేడారం ఏర్పాట్లలో పూర్తి వైఫల్యం..

దేశంలో రెండవ అతి పెద్ద జాతరగా పేరున్న మేడారం జాతర ఏర్పట్లలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందనే విమర్శలు వచ్చాయి. సకాలంలో ఏర్పాట్లు పూర్తి కాక పోవడం, నాసిరకం పనులతో పాటు అనేక నిర్వహణా లోపాలు కనిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి జాతర విషయంలో విమర్శలు రావడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. జాతర ఏర్పాట్ల విషయంలో మంత్రి సీతక్క ఆదేశాలను కూడా కలెక్టర్ ఖాతరు చేయలేదని తెలిసింది. ఒక దశలో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కలెక్టర్ కు బదిలీ తప్పదనే వార్తలు వచ్చాయి. ఇది ముందే తెలుసుకున్న కలెక్టర్ బదిలీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.