ఈరోజు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు పలు విషయాల పైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ ఫోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోకుండా పార్టీలు మారే పనిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చర్యలపై మేయర్ ఫోకస్ పెట్టారు కానీ ప్రజా సమస్యలకు పట్టించుకోవడం లేదు,ఎండాకాలం వచ్చిన వెంటనే తాగునీటి కష్టాల పైన అదే విధంగా వేసవిలో చేయాల్సిన నాళాల కూడికతీత పనులు చేయడం లేదు అని అన్నారు. శ్రవణ్ మల్కాజ్గిరి బిజెపి కార్పొరేటర్ మల్కాజ్గిరి మాట్లాడుతూ అధికారులు ఫోన్లు కూడా మాట్లాడడం లేదు, ప్రజా సమస్యలను తెలియజేస్తుంటే ఎన్నికల కోడ్ ఉంది అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నికల పేరు చెప్పి ఎలాంటి పనులు చేయకుండా కొంత మంది జిహెచ్ఎంసి అధికారులు తప్పించు కుంటున్నారని అన్నారు.
ఎన్నికల కోడ్ జూన్ వరకు ఉన్న సందర్భంలో నాలా పనుల జాప్యం జరుగుతోందని దానివల్ల వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కమిషనర్ వెంటనే స్పందించి ఎలక్షన్ కమిషన్ నుండి అత్యవసర నాలా పనులకు అనుమతి తీసుకుని వెంటనే టెండర్ లో ఉన్నటువంటి, శాంక్షన్ అయినటువంటి నాలా పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నాలాల కూడికతీతకు సంబంధించి కొన్ని టెండర్లు,గతంలో ఆరంభించి ఆపినటువంటి నాలా పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్లో ప్రజా సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు, అదేవిధంగా సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు అడిగినా కూడా ఇవ్వడం లేదు అని ఆవేదన చెందారు. చేసిన పనులలో అవినీతి, అక్రమాలు బయటపడతాయని అధికారులు వివరాలు బయటికి చెప్పడం లేదు అన్నారు. ఆర్టిఐ లకు వెంటనే సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

జిహెచ్ఎంసి ముందున్నటువంటి ఒక నాలాను చూపించి(సిల్ట్ పేరుకు పోయి వుంది)దాంట్లో ఉన్న సిల్ట్ పరిస్థితి ఈ విధంగా ఉంటే బయట ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలని అన్నారు. ఎలక్షన్ కోడ్ అని చెబుతూ ఎలాంటి పనులు చేయకుండా కొంతమంది అధికారులు తప్పించుకుని తిరుగుతున్నారని అటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా ప్రజల ముక్కు పిండి టాక్స్ వసూళ్లకు మాత్రం ఎలక్షన్ కోడ్ అడ్డు రావట్లేదని ప్రజా సమస్యలు తీర్చడంలో మాత్రం ఎలక్షన్ కోడ్ ఏ విధంగా అడ్డొస్తుందని ప్రశ్నించారు. అదేవిధంగా గత కౌన్సిల్ సమావేశంలో చర్చించిన విధంగా అక్రమార్కులైనటువంటి ఆఫీసర్లను వెంటనే తీసివేసి జిహెచ్ఎంసిను ప్రక్షాళన చేయాలని అటువంటి అధికారులతో ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ, ఎన్నికల ముందు గత ఎమ్మెల్యేలు హడావిడి చేసి పనులకు శంకుస్థాపన చేసి వెళ్లారు,ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు అన్నారు. హైదరాబాద్ ప్రజలు పడుతున్న టాక్స్ డబ్బులు మళ్ళీ వారికే ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు. మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ మాట్లాడుతూ గతంలో తీసుకొచ్చిన చీకటి జీవోల ద్వారా చెరువులు కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తుంది, భాగ్యనగరంలో చెరువులను నాళాలను కాపాడకుంటే 2020లో వచ్చిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.జోన్ మార్పు చేసి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.