A place where you need to follow for what happening in world cup

కంటోన్మెంట్‌ అసెంబ్లీ బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గైని నందిత

లాస్య సోదరికే టిక్కెట్‌ ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవ ర్గానికి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గైని నందితను పార్టీ ప్రకటించింది. తమ పార్టీ నుంచి దివంగత సాయన్న మరో కూతురు నందితను ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థి పేరును బుధవారం నాడు ఖరారు చేసింది.

అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి గైని నివేదిత పేరును పార్టీ అధినేత కేసీఆర్‌ బుధవారం నాడు అధికారికంగా వెల్లడిరచారు. నివేదిత అభ్యర్థిత్వానికి సంబంధించి స్థానిక నేతలు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ చర్చించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కంటోన్మెంట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్‌ సభ ఎన్నికలతోపాటు మే 13వ తేదీన కంటోన్మెంట్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.