- నిమజ్జనం, శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరగాలి
- DJ లు, బాణాసంచా పూర్తిగా నిషేదం.
- ఉత్సవ కమిటీలు, అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి.
గణేష్ శోభాయాత్ర, నిమర్జనం కార్యక్రమాలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరగాలని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా జిల్లాలో పటిష్ఠమైన పోలీసు భద్రత చర్యలు తీసుకోవడం జరిగినదని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంభందిత అధికారులతో సమన్వయం చేసుకుని ముందస్తు అన్ని ఏర్పాటు చేయడం జరిగినదనీ. క్రెయిన్ లు, గజ ఇతగాళ్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగినదన్నారు.
జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జ నం ప్రదేశంలో లైటింగ్స్, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారనీ,గణేష్ నవరాత్రులు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయనీ, అలాగే గణేష్ శోభాయాత్ర గణేష్ నిమజ్జనం కార్యక్రమాలను ప్రజలు సంతోషకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు .ఇందుకోసం జిల్లా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినదనీ ఎస్పీ తెలిపినారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉత్సవం జరుపుకోవాలని కోరినారు.
గణేష్ శోభాయాత్రకు సంబంధించి అన్ని మార్గాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలు చేయిస్తామని, జిల్లా కేంద్రం తోపాటు అన్ని మండలాలు గ్రామాలలో శోభాయాత్రకు సంబంధించి రూట్ మ్యాపింగ్ సెక్టార్లుగా విభజించి బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపినారు. అత్యవసర సమయాల్లో 100 కు ఫోన్ చేయాలని అన్నారు. జిల్లా అధికారులు, ఇతర శాఖల సమన్వయంతో పని చేస్తామని అన్నారు. ఉత్సవ కమిటీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. యువత ఆదర్శంగా ఉండాలనీ కోరారు.
పోలీసు వారి సూచనలు
• DJ లు పెట్టవద్దు, పూర్తిగా నిషేదం.
• సాంసృతిక కార్యక్రమాల పేరిట ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు.
• ఇతరులను, మహిళలను అగౌరవ పరచవద్దు.
• మతసామరస్యానికి ప్రతిఒక్కరూ పాటుపడాలి.
• పుకార్లను సృష్టిoచ వద్దు.
• నీటి ప్రవహమలోకి, లోతట్టు ప్రాంతాలలోకి దిగవద్దు.
• వర్షం కురుస్తున్నది కావున ప్రమాదాలకు దూరంగా ఉండాలి, విద్యుత్ తీగలను గమనిస్తూ ముందుకు సాగాలి.
• గణేష్ ఉత్సవాలలో ” టపాసుల” నిషేధం గలదు.
• వాహనం పూర్తి కండిషన్ లో ఉండాలి.
• శోభాయాత్ర లో చిన్న పిల్లలు ఉండకుండా చూసుకోవాలి.
• గణేష్ ప్రతిమలను పోలీస్ వారి సూచనల మేరకు నిమజ్జనం చేయవలను.
• నిమజ్జనం రోజు కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలు వెల్లడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతీ గణేష్ ను నిమజ్జనం చేసే రోజు తప్పక పెద్దవాళ్లు ఉండవలెను. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా
ఇంటికి చేరుకోవలెను.
• నిమజ్జనంచేసే సమయంలో ఎవ్వరు కూడా స్నానములు చేయకూడదు. సెల్ఫోన్తో సెల్ఫీలు దిగవద్దు.
• ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడు సహకరించవలెను.
• చెరువులు, కుంటలు, కాలువలు నదులు అధిక నీటి ప్రవాహంతో ఉన్నాయని నీటిలోకి ఎవరు దిగవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేసినారు.
• శోభాయాత్రకు వినియోగించే వాహనాలపై వృద్ధులను పిల్లలను ఎవరిని ఎక్కించవద్దని కోరినారు.
• డీజే లను అనుమతించడం లేదని బాణాసంచాక కూడా అనుమతి లేదని ఎస్పీ తెలిపినారు.
• శోభయాత్ర సందర్భంగా ముఖ్యంగా యువత విద్యార్థులు ఆదర్శంగా ఉండాలి, వివాదాలు గొడవలు పెట్టుకోవద్దు శోభాయాత్ర సమయంలో ఒకరికొకరు పోటీ పడవద్దు అని ఎస్పీ విజ్ఞప్తి చేసినారు.