A place where you need to follow for what happening in world cup

బ్యాంకులో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు బీమా చేయించుకోండి

  • సంవత్సరం కి 20 రూ చెలిస్తే రెండు లక్షల భీమా
  • అచ్చంపేట్ డిసిసిబి బ్యాంక్ మేనేజర్ భూపాల్ రెడ్డ

నాగర్కర్నూల్:సంవత్సరం కి 20 చేస్తే రెండు లక్షల భీమ సౌకార్యం ఉంటుందని అచ్చంపేట్ డిసిసి బ్యాంక్ మేనేజర్ బూపాల్ రెడ్డి అన్నారు మంగళవార సురపూర్ రైతువేదికలో రైతులకు పిఎ సి అంబట్ పల్లి అధ్వర్యం లో ఏర్పాటుచేసిన  సమావేశం లో వారు మాట్లాడుతూ 18 -70 సంవత్సరాలలోపు ఉన్నవారికి  ఖాతా తీసుకుంటే సంవత్సరానికి ₹20 చెల్లిస్తే ఇన్సూరెన్స్ ఎలాంటి ప్రమాదతో మరణించిన రెండు లక్షల భీమ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 18-50 వయసు వారు 436 రూపాయలు చెల్లిస్తే అనారోగ్యంతో మరణిస్తే రెండు లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు.

క్రాప్  లోన్ తీసుకున్న ప్రతి రైతు రెన్యువల్ చేయాలని సూచించారు. అదేవిధంగా రెండున్నర ఎకరాలు  ఉన్న ప్రతి రైతు బర్రెలు గొర్రెలు కోసం ఆరు లక్షల పైన ఎల్టి లోన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఇల్లు లేని వారు ఉంటే భూమి కలిగి ఉండి ఉన్నవారికి ఎల్టి లోన్స్ 10 లక్షలు వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినవారు పై చదువుల కోసం ఎల్టి లోన్స్ కావలసినవారు భారతదేశంలో చదివే వారికైతే రేపు 10 లక్షల లోపు, ఇతర దేశాలకు చదువు కోసం వెళ్లిన వారికి అయితే 25 లక్షల వరకు ఎల్టి  లోన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా గోల్డ్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక తుల 35 వేల దాకా  ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ శ్రీనివాస్ యాదవ్,  సింగిల్  కార్యాలయం సీఈవో  పాండు. డైరెక్టర్ నరసింహ, అచ్చంపేట డిసిసిబి బ్యాంకు సూపర్వైజర్ మోహన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.