A place where you need to follow for what happening in world cup

మీ అండతో కేసీఆర్​తో కొట్లాడుత!

0 317

ఆత్మ గౌరవం ముందు డబ్బులు తృణపాయం
నెల ఓపిక పట్టండి.. తర్వాత అంతా సంతోషమే!
కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు
ఆయన దళితుల కడుపు కొట్టిన మాట వాస్తవం కాదా?
ఈటల లేకపోతే కేసీఆర్ మిమ్మల్ని గాలికి వదిలేసేవాడు
గజ్వేల్ సభలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

సిద్దిపేట(గజ్వేల్): ‘గజ్వేల్ నియోజకవర్గానికి నేను కొత్త కాదు. 1994 లోనే బతకడానికి ఇక్కడికి వచ్చా. నేను 20 ఏండ్లు మీ కండ్ల ముందు పెరిగిన బిడ్డను. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటో తెలంగాణ ప్రజల గుండెలకు తెలుసు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని శాసనసభలో 3 గంటలపాటు ఆవిష్కరించిన క్షణాలు ప్రజలు ఎవరూ మరిచిపోరు. గజ్వేల్ ప్రజల అండతో కేసీఆర్ తో కొట్లాడుతా.’ అని బీజేపీ గజ్వేల్​అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ఓట్ల కోసమే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు..
2004లో మొదటి సారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాక అణగారిన వర్గాల జాతుల సమస్యలపై గొంత్తెత్తానని ఈటల అన్నారు. ప్రతీ క్షణం పేదల కోసమే నిలబడ్డానని గుర్తు చేశారు. అశ్వత్థామ రెడ్డి ఆధ్వర్యంలో అప్పటి యూనియన్ ఆర్టీసీ కార్మికులు నెలల తరబడి ఉద్యమం చేస్తే.. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని కేసీఆర్ వ్యాఖ్యానించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని ఆరోపించారు. అటు మున్సిపల్ కార్మికులు ధర్నాలు చేస్తే కనీసం పట్టించుకోకుండా 1,700 మందిని ఉద్యోగం నుంచి తొలగించిన ఘనత కేసీఆర్ ది కాదా అని ప్రశ్నించారు. ఎన్ని పథకాలు తెచ్చినా వారి మనుషులకు తప్ప సామాన్యులకు ఫలాలు అందిన దాఖలాలు లేవన్నారు.

ఎంత మంది 3 ఎకరాలు ఇచ్చారు..
ఇప్పటి వరకు ఎంత మంది దళిత బిడ్డలకు 3 ఎకరాలు అందించారని ఈటల కేసీఆర్​ను ప్రశ్నించారు. దళిత బంధు ఎంత మందికి వచ్చిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎంత మందికి దళిత బంధు వచ్చిందని ప్రశ్నించారు. అటు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములు గుంజుకున్న బాధితులకు అన్యాయం జరిగిందని, అరకొర డబ్బులు అందజేసి వారికి తీరని అన్యాయం చేశారన్నారు. అటు ఆర్ఆర్ లీక్ కూడా 5,800 ఎకరాలు దళితుల భూములు లాక్కుని 600 నుంచి 700 గజాల స్థలం ఇచ్చి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మారారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పిన మాటలను తనకే అప్పజెప్పే సమయం వచ్చిందని.. మనమే అప్పజెబుదామని పేర్కొన్నారు. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు కేసీఆర్ ప్రదర్శిస్తారని వాటిని నమ్మకుండా బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.

150 ఎకరాలున్న కేసీఆర్ కి రైతు బంధు వస్తుంది..
ఆత్మ గౌరవానికి తాకట్టు పెట్టిన చరిత్ర కేసీఆర్​దని, వరుసగా తాను 7 సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాయని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అప్పటికప్పుడు 600 కోట్లతో పనులు చేశారని, ప్రతి గల్లీకి రోడ్లు వేశారని కానీ ప్రజలు అన్ని తీసుకొని తనకి ఓటు వేసి గెలిపించారని అన్నారు. గజ్వేల్ ప్రజలు కూడా వాల్లు ఇచ్చినవన్నీ తీసుకుని తనకే ఓటు వేసి గెలిపించాలన్నారు. సభ ఉందనగానే గ్రామాల్లో బెదిరింపులు మొదలయ్యాయని, ఎక్కడికక్కడే ప్రజలు సభకు రాకుండా అడ్డుకున్నారని, అయినా ప్రజలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈటల లేకపోతే మిమ్మల్ని గాలికి వదిలేసేవాడని, తాను వచ్చాక అందరకీ మర్యాద పెరిగిందని అన్నారు. కుల సంఘాలకు పైసలిచ్చి.. పసుపు బియ్యంతో ప్రమాణాలు చెయిస్తున్నారని మండి పడ్డారు. 150 ఎకరాలు ఉన్న కేసీఆర్ కి కూడా రైతు బంధు వస్తుందని, తాము అధికారంలోకి వస్తే కేవలం పేద రైతులకు మాత్రమే రైతు బంధు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ప్రతి అంశంపై ఫోకస్ పెడుతామని అన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యగాలే కాకుండా ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామనాన్రు. భార్య బిడ్డల కోసమా దుబయ్ లాంటి దేశాలకు వెళ్లే వారికి 1000 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టి వారు ఉద్యోగం సాధించేంత వరకు అండగా ఉండేందుకు కృషి చేస్తామని, కౌలు రైతులకు 5 లక్షల రూపాయల బీమా అందేలా చర్యలు తీసుకుంటామని ఈటల తెలిపారు.

ఓట్ల కోసమే మేనిఫెస్టో..
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసమే మేనిఫెస్టో ను విడుదల చేశారని ఈటల అన్నారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే దళితబంధు పథకాలకు అవసరమయ్యే నిధుల గురించి చెబితే.. నీకేం తెలుసని ఈసడించుకున్నారని, కానీ తెలంగాణ ఏర్పడ్డాక 10 వేల కోట్ల రాబడి మద్యం పాలసీలో ఉంటే.. దాన్ని 45 వేల రాబడికి తీసుకువచ్చారన్నారు. దేశంలోనే తాగుడులో తెలంగాణ నంబర్ వన్ అయ్యిందని, ఎంతో మంది అడబిడ్డల తాళి బొట్లు తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగుడు కు బానిసై వచ్చిన మగవాళ్లు.. పెళ్లాం పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారని అన్నారు. నాడు తనని అవమానించి బయటకి పంపారని కేసీఆర్ బొమ్మతో పోటీ చేసిన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారన్నారు. అప్పుడే తన ఆత్మగౌవానికి విలువనిచ్చి హుజూరాబాద్ ప్రజల అండతో గెలిచి చూపించానన్నారు. అప్పుడు చెప్పినట్టుగానే కేసీఆర్ మీద పోటీ చేయడానికి వచ్చానని తెలిపారు. నెల రోజులు ఓపిక పట్టండని ఆ తర్వాత ఇక మొత్తం సంతోషమే ఉంటుందని అన్నారు. ఇక్కడ కూడా గజ్వేల్ ప్రజల అండతో గెలుస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.