తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు ఐలమ్మ అని ఎంపీపీ వంగ కరుణ, జడ్పిటిసి విజయ అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని గంభీరావుపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెగువ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి,పల్లెపల్లెన ఉద్యమం అలలు అలలుగా ఎగిసిపడిందనీ అన్నారు.బడుగు బలహీన వర్గాల కోసం, దుక్కి దున్నే వాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు అఘాయిత్యాలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేసిన వీరనారి అని అన్నారు.
యోధురాలు జయంతి వేడుకలను సీఎం కేసీఆర్ ప్రతి ఏటా రాష్ట్ర వేడుకగా అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్ పంతులు, సెస్ డైరెక్టర్ నారాయణరావు, ఆర్బిఎస్ కోఆర్డినేటర్ రాజేందర్, మాజీ జడ్పిటిసి మల్లు గారి నర్సాగౌడ్,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్ స్వామి గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు గంట అశోక్, ఉప సర్పంచ్ నాగరాజు, రజక సంఘము మండల అధ్యక్షుడు మహేందర్, రజక సంఘము భాస్కర్, నాయకులు దయాకర్ రావు, రాజారాం, సురేందర్ రెడ్డి, లక్ష్మణ్,రాజనర్సు, రాజారాం, లక్కిరెడ్డి రాజిరెడ్డి, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.