- టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు
- షాద్ నగర్ లో చంద్రబాబుకు మద్దతుగా రిలే దీక్షలు ప్రారంభం
రాజకీయాల్లో చంద్ర బాబు ఆదర్శ నాయకుడని, అలాంటి నిజమైన నాయకుడిని పై అక్రమ కేసు పెట్టి జైల్లో కట్టడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు తగదని, జగన్ కు పోయేకాలం దాపురించిందని తెలుగుదేశం పోలీట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు
అన్నారు.
ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ పట్టణంలో మంగళవారం రిలే దీక్షలు ప్రారంభించారు.
ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో చంద్ర బాబు ఆదర్శ నాయకుడని పలువురు నాయకులు అన్నారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అని నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే మచ్చలేని నాయకుడని, యువతరానికి ఆదర్శప్రాయుడని అన్నారు. అక్రమ కేసుల నుంచి ఆయన బయటపడి, 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రానికే కాకుండా యావత్తు భారత దేశానికే ఆయన రాజకీయాలు ఆదర్శమని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రను చూసి సహించలేక చంద్రబాబును జగన్ అక్రమ కేసుల్లో ఇరికించారని ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారని, నిరసనల పర్వం కొనసాగుతోందని అన్నారు. పార్టీలకు అతీతంగా బాబుకోసం మేముసైతం అంటూ నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు. భారతదేశానికి అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతిని, ఐకే గుజ్రాల్, దేవెగౌడ వంటి మహనీయులను ప్రధాన మంత్రులను చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కిందని అన్నారు. వేల కోట్ల స్కాం చేసిన జగన్, మచ్చలేని చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించి, అరెస్టు చేయించడం రాజకీయ కుట్ర అని అన్నారు.నిరసనలో చంద్రబాబు, నందమూరి అభిమానులు చల్లా వెంకటేశ్వరరెడ్డి,ఎల్. కుమార్ గౌడ్, గంధం ఆనంద్. పీ.రాజశేఖర్ రెడ్డి, అంజయ్య, కావలి నర్సింహులు, ఆర్. బాబునాయక్ , కందూరి అంజయ్య గౌడ్, అప్పన్నగారి భాస్కర్ రెడ్డి, బక్కని శ్రీను, కుమ్మరి శ్రీను, చుక్క శేఖర్ గౌడ్, పుట్నాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.