- సంచలనంగా ఎన్నికలు ప్రారంభం కాకముందే
- రికార్డ్ స్థాయిలో లెక్కా పత్రాలు లేని సొత్తు స్వాధీనం
భారత దేశ చరిత్రలోనే 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్ ఫేస్ పోలింగ్ కూడా ప్రారంభం కాకముందే అక్షరాల 4 వేల 650 కోట్ల రూపాయల విలువైన సొత్తును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్నది. ఎన్నికల సంఘం అధికారులకే ఇప్పుడిది షాకింగ్‌గా ఉంది.
ఎందుకంటే..2019 ఎన్నికల్లో మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 3 వేల 500 కోట్లుగానే ఉంది..2024లో మాత్రం ఇంకా పోలింగ్ పక్రియ ప్రారంభం కాకముందే 4 వేల 650 కోట్ల విలువైన సొత్తు..లెక్కాపత్రాలు లేకుండా దొరకటం అనేది దేశ రాజకీయాలను షాకింగ్‌కు గురి చేస్తున్నాయి.