A place where you need to follow for what happening in world cup

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

0 2,607

నయనానందకరం….జగదభిరాముని కల్యాణం
నేటికీ రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు
ఆ శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం
రేపు భదాద్రి రాములోరి కల్యాణం

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :  అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యా పురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా దీవిస్తారు. నిజమైన దాంపత్యానికి నిదర్శనమైన శ్రీ సీతారాముల పెళ్లి వేడుక ఆంధ్రుల అయోధ్యాపురి అయిన భద్రాచలంలో కన్నులపండువగా ప్రతీ ఏటా పునర్వసు నక్షత్రంలో అభిజిత్‌ లగ్నమందు చైత్రశుద్ధ నవమి నాడు జరుగుతుంది. నయనానందరంగా సాగే జగదభిరాముని కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు భద్రాచలం చేరుకుంటారు.
ఆ దేవదేవుని కల్యాణ మహోత్సవం రేపు 17వతేదీ బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించ నున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత నిర్వహించడం ఆనవాయితీ. సూర్యుడు ఉన్న రాశి నుండి నాల్గవ లగ్నం ఏ లగ్నమందవుతుందో ఆ లగ్నాన్ని అభిజిత్‌లగ్నమని పిలుస్తారు. దేశమంతటా శుభకార్యాలు ఈ లగ్నంలోనే జరగడం విశేషం. శుభపద్రమైన అభిజిత్‌ ముహూర్తం అనేక దోషాలను పోగొడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ముహూర్తం మంగళకరమైనదిగా భావిస్తారు. అందుకే ఆనాది కాలం నుండి అభిజిత్‌లగ్నంలో భద్రాచలంనందు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించడం జరుగుతుంది.
image.png
నయనానందకరం….జగదబిరాముని కల్యాణం
ప్రత్యక్షంగా దేవదేవుని పెళ్లి వేడుకును కనులారా వీక్షిస్తే అంతకుమించిన మహాత్భాగ్యమేనని అందుకే నయనానందకరంగా సాగే శ్రీ సీతారాముల పెళ్లి వేడుకను చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు. ఆ రోజుల్లో రాష్ట్రంలోని దారులన్ని రామనామంతో రామనవమి వైపుకే నడిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ఆ నాడు సాగే కళ్యాణతంతు భక్తుల జీవితాల్లో పదిలంగా ఉండిపోతుంది. తొలుత భదాద్రి రామునికి దేవాలయంలో ధృవమూర్తుల కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ భక్తుల జయజయ ధ్వానాలు రామనామ స్వరాల మధ్య అత్యంత వైభవంగా పల్లకిలో మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపానికి తోడుకుని వొస్తారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం నిర్వహించి సర్వశాంతికై విశ్వక్సేన పూజలు నిర్వహిస్తారు.
సృష్టిలయ కారకు డైన విష్ణు సంబంధమైన పూజాకార్యక్రమాలు, శుభ కార్యాలను పూజించడం ఆనవాయితీ. అనంతరం వేదపండితులు పుణ్యాహవచనం నిర్వహిస్తారు. మంత్రబలంతో కల్యాణానికి వినియోగించే సకల సామాగ్రిని సంప్రోక్షణ చేస్తారు. రక్షాబంధనం, మోక్షాబంధనం నిర్వహిస్తారు. ఆనాడు 24 అంగుళాల పొడవు గల 12 దర్బలతో అల్లిన ఒక దర్భతాడును సీతమ్మవారి నడుముకు మంత్రోచ్చరణాల నడుమ బిగిస్తారు. ఇలాంటి తాడును ధరించడం వల్ల స్త్రీలకు ఉదర సంబంధిత రోగాలు నయమవుతాయని పండితులు చెబుతుంటారు. అనంతరం శ్రీరాముని కుడిచేతికి, సీతమ్మ తల్లి ఎడమ చేతికి రక్షాసూత్రాలను ధరింపజేస్తారు. ఆ తరువాత సువర్ణయజ్ఞోపవితాన్ని ధరింపజేస్తారు. ఈ తంతులో 8 మంది వైష్ణవులకు తాంబులాది సత్కారాలు నిర్వహించి కన్యావరణం చేస్తారు.
అటు తరువాత వధూవరుల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాదపక్ష్రాళన అనంతరం పుష్పోదకస్నానం చేయిస్తారు. మహాసంకల్పం పఠిస్తారు. పఠించే ఈ సంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దం పడుతూ జాతీయభావాన్ని మనలో పటిష్టపరుస్తుంది. ఆ తరువాత కన్యాదానం జరిపిస్తారు. మంత్రధార పూర్వకంగా కన్యాదానం జరుగుతుంది. మంగళాష్టకాలు పఠిస్తారు. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా  వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిజిత్‌లగ్నం సమీపిస్తుండగానే శ్రీ సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. ఈ జీలకర్ర బెల్లం శిరస్సులపై ఉంచితే మనలో సత్యం, సత్‌భావాన్ని పెంచుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అటు తరువాత జరిగే మాంగల్యపూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను అవాహం చేస్తారు.
తొమ్మిదిపోగులతో, మూడు సూత్రాలతో తయారయ్యే మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటిచెబుతుంది.  తొమ్మిది పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు. మూడు సూత్రాలు కర్మ,జ్ఞాన, భక్తి మార్గాలకు దారులు. సూత్రమూలములు గౌరిదేవిని, సూత్రమధ్యలో సరస్వతీని, సూతాగ్రంలో మహాలక్ష్మీని అవాహం చేస్తారు. ఈ ముగ్గురమ్మల అనుగ్రహంతోనే లోకంలోని సౌశిల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు  వర్థిలుతుంటాయని చెబుతారు. భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాల్లో భక్తరామదాసు చేయించిన మంగళపతకాన్ని కలిపి ధరింపచేయడం ఈ భదాద్రి క్షేత్రంలో ఆచారం. అనంతరం శుభదాయకమైన తలంబ్రాల కార్యక్రమం పూర్తి చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపునుంచి ప్రతీ ఏటా ముత్యాల తలంబ్రాలు స్వామివారి పెళ్లికి సమర్పిస్తారు. బంతులాట తరువాత సీతారాములకు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీర్వచనం ఇవ్వడంతో ఈ కళ్యాణక్రతువు పూర్తవుతోంది.
image.png
నేటికి రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు
భక్తరామదాసుగా ప్రసిద్దికెక్కిన కంచర్ల గోపన్న రామాలయం నిర్మించిన కాలంలో సీతారాములకు బంగారు ఆభరణాలు చేయించారు. ఆ నాడు సీతమ్మ తల్లికి రామదాసు చేయించిన మంగళసూత్రాన్నే ఇప్పటికి కూడా ధరింప జేస్తారు. అదేవిధంగా పచ్చల పతకాన్ని రామదాసు రామయ్య తండ్రికి చేయించారు. భరతాగ్రజుడైన శ్రీరామునికి శ్రీరామనవమి, ఇతర ప్రత్యేక ఉత్సవాల్లో ఈ ఆభరణంతో అలకరిస్తారు.  సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకాము రామచంద్రా అంటూ వాగ్గేయ కారుడు రామదాసు కీర్తించిన పతకం ఇదే. ఈ పతకం చక్కగా, ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. పతకంలో ఎర్రని రాళ్ళు పొదిగి అందంగా తయారు చేయించారు. రామదాసును చెరనుంచి విడిపించడానికి రామలక్ష్మణులు ఇద్దరు గోల్గొండ నవాబైన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజి అనే సిపాయిల రూపంలో వెళ్లి ఆలయం నిర్మించడానికి ఖర్చు చేసిన  6 లక్షల వెండి నాణెలుకు బదులుగా 6 లక్షల బంగారు నాణెలు చెల్లిస్తారు. ఆ నాణెలపై ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు దాసాంజనేయ స్వామి రూపం ఉంటాయి. ఆ నాణెనికే రామమాడ అని పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఈ రామ మాడను శ్రీరామ నవమి, ఇతర ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణ స్వామికి అలంకరిస్తారు.
స్వామి వారి శిరస్సుపై నుంచి జాలువారిన ఆ ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం
ముత్యం అంటేనే అతి పవిత్రమైనది. అందునా….సాక్ష్యాత్తు దేవదేవుని శిరస్సులపై నుంచి జాలువారిన ముత్యాలంటే మరింత పవిత్రమైనవి. అందుకే శ్రీ సీతారాముల పెళ్లిలో వాడిన తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఎక్కువ మక్కువ చూపుతారు. తానీషా ప్రభువుల కాలం నుంచి శ్రీ సీతారాముల పెళ్లి వేడుకకు ప్రభుత్వం తరుపు నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టుపీతాంబరాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. అదే ఆనవాయతీ నేటికి కూడా శుభప్రదంగా కొనసాగడం ఆనందదాయకం. రాష్ట్ర ప్రభుత్వం తరుపునుంచి ప్రతీ ఏటా ముఖ్యమంత్రి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొస్తుంటారు.  ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రభుత్వం తరుపున ఎవరు తెస్తారు వేచి చూడాల్సి ఉంది.
సీతమ్మకు చేయిస్తినే…
పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా!!.. అ్న భక్తరామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరత్ను పేరిట చేయించిన ఈ పతక్నా భరతాగ్రజుడైన రామయ్యతండ్రికి శ్రీరామనవమి నాడు మరియు ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరామ్నుకి అలంకరిస్తారు.
చింతాకు పతకం : సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!! అ్న రామదాసు కీర్తించిన పతకమిదే. ఈ పతక్నా శ్రీరామనవమి నాడు, అలాగే ప్రత్యేకమైన ఉత్సవాల్లో సీతమ్మ తల్లికి అలంకరిస్తారు.
image.png
మంగళసూత్రం : మూడు మంగల్యాలు గల మంగళ సూత్న్రా రామదాసుగారు చేయించారు. ఒకటి దశరధ మహారాజుగారి తరుపున, రెండు జనక మహారాజు తరపున, మూడు శ్రీ భక్తరామదాసు గారే కన్యాదాతగా తమ తరపున అమ్మవారికి సమర్పించినది. ఈ మాంగల్యముతోనే శ్రీరామ నవమినాడు కల్యాణ మహోత్సవము జరుగును.
శ్రీరామ మాడ : రామదాస్ను చెరనుండి విడిపించడ్నాకి రామలక్ష్మణులిద్దరూ గ్కోండ నవాబైన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజీ అనే సిపాయిల రూపాతో వెళ్ళి, ఆలయం నిర్మించడ్నాకై ఖర్చు చేసిన 6 లక్షల వెండి నాణాలకు బదులుగా 6 లక్షల బంగారు నాణాలు చెల్లించారు. ఆ నాణాలపై ఒక వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు దాసాంజనేయస్వామి రూపు ఉంటాయి. ఆ నాణ్నాకే రామ మాడ అ్న పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఆ రామమాడను శ్రీరామనవమి మరియు ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణస్వామికి అలంకరిస్తారు.

శ్రీ సీతారాముల కల్యాణ  ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి లేదు
ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు
సీతారామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించండి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి  మంత్రి కొండా సురేఖ మూడోసారి లేఖ
భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు 17వ తేదీన నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 18వ తేది మహాపట్టాభిషేకానికి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి లేదని ఎలక్షన్‌ కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ టివిలో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రచారం నిర్వహించే వారు. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం లేదని తెలిసింది. ఒకవేళ ప్రత్యక్ష ఇవ్వాలనుకుంటే కేవలం దేవస్థానం ఖర్చుతోనే నిర్వహించుకోవాలనట్లు తెలిసింది. ప్రభుత్వం ఖర్చుతో అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. గత కొన్నేళ్ళుగా వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామివారి కల్యాణాన్ని వీక్షించే అదృష్టం ఉండేది.  నేరుగా కల్యాణం చూడలేని వృద్ధులతో పాటు వికలాంగులు టీవీల వద్ద కూర్చుని కల్యాణం చూసే అవకాశం ఉండేది. ఈ సారి ఎన్నికల కోడ్‌ ఉండటం వలన ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి లేదని చెప్పినట్లు తెలుస్తుంది. కాగా గతంలో ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం ఇచ్చారు.
సీతారామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించండి :  మంత్రి కొండా సురేఖ మూడోసారి లేఖ
భదాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించిన నేపథ్యం లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మూడోసారి లేఖ రాశారు. సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 40 ఏళ్లుగా కల్యాణ మహోత్సవం ప్రత్యక్షప్రసారం జరుగుతుందని చెబుతూ..ఆలయ విశిష్టత, సంప్రదాయాలను లేఖలో వివరించారు. ఈ నెల 17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం వైభవోపేతంగా నిర్వహించనున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.