భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కి వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వలన విద్యార్థులు ప్రయివేట్ కళాశాలలో చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భువనగిరి పట్టణం లో ఎస్ ఎల్ ఎన్ఎస్ డిగ్రీ కళాశాల (ఎయిడెడ్ ) హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా నడుపబడుచున్నదని అట్టి కళాశాల అన్ని మౌలిక సదుపాయాలతో విశాలమైనా ప్రదేశంలో ఉన్నది కావున అట్టి ఎయిడెడ్ కళాశాల ను ప్రభుత్వ కళాశాల గా మార్చి భువనగిరి పట్టణ, చుట్టుపక్కల గ్రామ విద్యార్థులకు సౌకర్యం కల్పించగలరని కోరారు.