- మండలంలో పలు గ్రామంలో ఎన్నికల ప్రచారం…
- మంత్రి సతీమణి స్నేహలత..
గొల్లపల్లి. ముద్ర: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లోబిఆర్ ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వరను భారీ మెజారిటీతో గెలిపించి ధర్మపురి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని మంత్రి సతీమణి , గ్రామ ప్రజలను కోరారు. మంగళవారం సాయంత్రం మండలం గోవిందుపల్లె గ్రామంలో వారు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజలకు చేరువలో ఉన్న నాయకుడిని ప్రజలు విస్మరించరని అందుకు ధర్మపురి నియోజకవర్గలో అత్యధిక మెజారిటీ ని ఇవ్వడం జరిగిందనీ వారు గుర్తు చేశారు.
ప్రజలు ఎంత మెజారిటీ ని ఇచ్చారో అంతే వేగంగా అభివృద్ధి చేసి చూపించాడని మరొకసారి ఆశీర్వదించి భారీ మెజారిటీని అందిస్తే మరింత అభివృద్ధి కి అనుక్షణం మంత్రి పని చేస్తారని వారు వివరించారు ఈ కార్యక్రమంలో. సర్పంచ్ ముస్కు శెంకరవ్వ ఉప సర్పంచ్ కోట మహేష్ కుమార్ వార్డ్ సభ్యులు జంగిలి సురేష్ కుమార్ అన్నడ జీవన్ రెడ్డి. టిఆర్ఎస్ నాయకులు ముస్కు మల్లారెడ్డి. అల్లూరి మల్లారెడ్డి బద్దం సుదర్శన్ రెడ్డి కాల్వ రాజయ్య కాలువ మనోజ్ కుమార్ గుర్రం కళ్యాణ్. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.