రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ శివారు లో గల కాలువ వద్ద సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై అజయ్ తన సిబ్బంది తో సం యుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయికల్ మండలం వడ్డేలింగాపూర్ గ్రామానికి చెందిన బొడాసు సతీష్ కుమార్(20), తండ్రి రాజారెడ్డి మరియు జగిత్యాల పట్టణం అర్ ఎన్ టి నగర్ కి చెందిన బెక్కం రేవంత్ @ బిట్టు(22) తండ్రి రవీందర్ అను ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి సుమారు రూ. 39,000 విలువ గల1.56 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు మరియు బైక్ ను జప్తు చేయడం జరిగింది. వారి ఇరువురిపై ఎస్సై అజయ్ కేసు నమోదు చేసిన అనంతరం, దర్యాప్తు అధికారి అయిన జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ ఆలీ ఖాన్ రిమాండ్ కి తరలించడం జరిగింది. నిందితులను చాక చక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్స్ ప్రశాంత్, అశోక్ మరియు రామక్రిష్ణ లను సీఐ అభినందించారు.