అంతరిక్ష ఔత్సాహికులు, పరిశోధకులకు జీరో షాడో డే అనేది ఒక ఆసక్తికరమైన అంశం. జీరో షాడో డే సాధారణంగా సంవత్సరానికి రెండు రోజులు వస్తుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో చాలా కొద్ది సేపు ఎండలో నిల్చుంటే నీడలు కనిపించవు. అంతరిక్ష ఔత్సాహికులు, విద్యార్థులు, పరిశోధకులకు జీరో షాడో డే అనేది ఒక ఆసక్తికరమైన అంశం. జీరో షాడో డే సాధారణంగా సంవత్సరానికి రెండు రోజులు వస్తుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో చాలా కొద్ది సేపు ఎండలో నిల్చుంటే నీడలు కనిపించవు. బెంగళూరు లో ఈ ఆగస్ట్ 18 న జీరో షాడో డే జరగనుంది.
జీరో షాడే డే అంటే నీడలు కనిపించని రోజు అని అర్థం. సాధారణంగా ఏదైనా ఒక మనిషి, జంతువు, లేదా వస్తువుపై వెలుగు పడితే ఆ వెలుగుకు వ్యతిరేక దిశలో ఆ మనిషి, జంతువు, లేదా వస్తువు నీడ కనిపిస్తుంది. ఇది అత్యంత సాధారణ విషయం. కానీ, జీరో షాడో డే రోజు అలా కనిపించదు. అంటే, ఆ రోజంతా కాదు.. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో చాలా కొద్ది సేపు ఎండలో నిల్చుంటే నీడలు కనిపించవు. అందుకు కారణమేంటంటే.. సూర్యకిరణాలు సరిగ్గా నిట్టనిలువున ప్రసరించడం వల్ల ఇలా జరుగుతుంది.
భూగోళంపై కర్కట రేఖ, మకర రేఖల మధ్య, అంటే, 23.5-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాల మధ్య మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయా ప్రాంతాలపై నిట్టనిలువుగా, సరిగ్గా నడి నెత్తిన పడినప్పుడు… ఆ ప్రాంతంలోని వస్తువుల నీడలు కనిపించవు. అయితే, ఇది చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఇది ఆ రెండు అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాలకు సంవత్సరంలో రెండు సార్లు జరుగుతుంది.బెంగళూరులో అలా ఈ ఆగస్ట్ 18 న జరుగుతుంది. బెంగళూరు నగరంలో ఆగస్ట్ 18 మధ్యాహ్నం 12. 17 గంటల సమయంలో కొద్దిసేపు ఈ దృగ్విషయం గోచరిస్తుంది. ఏప్రిల్ 25న కూడా బెంగళూరు వాసులు ఈ జీరో షాడో డేను చూశారు. హైదరాబాద్ లో జీరో షాడో డే ఈ ఆగస్ట్ 3 వ తేదీన, అలాగే, మే 9వ తేదీన కూడా చోటు చేసుకుంది.