- సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ సమర్పించిన కేంద్ర ఎన్నికల సంఘం
- ఓటర్ నమోదుకు ఆధార్ ఐచ్ఛికమని స్పష్టీకరణ
- ఇప్పటికే 66 కోట్లకు పైగా ఆధార్ కార్డులను ఓటర్ కార్డులతో జత చేసినట్లు వెల్లడి
ఓటరు నమోదు కార్యక్రమానికి ఆధార్ కార్డు తప్పనిసరికాదని, అది ఐచ్ఛికమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానంకు తెలిపింది. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్‌ను సమర్పించింది. ఇప్పటికే 66 కోట్లకు పైగా ఆధార్ కార్డులను ఓటర్ కార్డులతో జత చేసినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్ 2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని పేర్కొంది.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అండర్ టేకింగ్‌ను సమర్పించింది. అండర్ టేకింగ్‌లో ఫారం 6, ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని తెలిపింది. ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022లోని రూల్ 26బీ ప్రకారం ఆధార్ నెంబర్ సమర్పణ తప్పనిసరి కాదని తెలిపింది.