- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన టీడీపీ అధినేత
- అక్టోబరు 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనానికి చంద్రబాబు పిటిషన్ కేటాయింపు
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు అక్టోబరు 3కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ భట్టి చంద్రబాబు పిటిషన్ ను విచారించలేనని స్పష్టం చేయడంతో, సీజేఐ బెంచ్ ఆ పిటిషన్ ను స్వీకరిస్తుందేమోనని చంద్రబాబు న్యాయవాదులు ఆశించారు.
కానీ అది సాధ్యం కాలేదు. తాజాగా, సెలవుల అనంతరం, చంద్రబాబు పిటిషన్ ను విచారించే ధర్మాసనాన్ని ఖరారు చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. 6వ నెంబరు కోర్టులో ఈ విచారణ జరగనుంది. చంద్రబాబు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఈసారి ప్రత్యక్షంగా హాజరయ్యి వాదనలు వినిపించనున్నారు.