- తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ బంద్
- విమానాశ్రయంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బంద్ కారణంగా విమాన టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులు
తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఐదు కన్నడ అనుకూల సంస్థలు చేపట్టిన బంద్ కర్ణాటకలో కొనసాగుతోంది. బంద్ సందర్భంగా బెంగళూరులో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా, ప్రైవేటు సంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు రోడ్డెక్కకపోవడంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది.