బీఆర్ఎస్ పై అసమ్మతతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ఢిల్లీలో మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మల్కాజిగిరి గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుల పనిచేసి అధికారులకు తీసుకువచ్చి బీఆర్ఎస్ నియంత పాలనను మట్టు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.