22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాలలో జమ
హైదరాబాద్:రైతు బంధు పథకం కింద తొలిరోజు రూ.642.52 కోట్లు 22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాలలో జమ చేసామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభమయింది. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాలలో నిధులు జమచేయడం జరుగుతుంది. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనలను పాటించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆర్థిక శాఖా మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలని మంత్రి అన్నారు.