A place where you need to follow for what happening in world cup

తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

తాహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించిన విశ్రాంత ఉద్యోగుల సంఘం
మంథనితెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను  వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంథని తాహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత పెద్ద సంఖ్యలో సభ్యత్వం కలిగి ఉన్న తమ సంఘం 1983లో స్థాపించబడినదని, రాష్ట్రమంతటా విస్తరించబడిన 33 జిల్లాల జిల్లా శాఖలు, 262 మండల శాఖలు కలిగి ఉన్న ఏకైక సంఘం తమదేనని అన్నారు.హైదరాబాద్ బడి చొడి లో సొంత రాష్ట్ర సంఘ భవనంతో పాటు జిల్లా మండల శాఖలో 100 సొంత భవనాలు కలిగి ఉన్నాయన్నారు.

అనునిత్యం విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి కృషి చేస్తూ ఎన్నో ప్రజాహిత సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న ఏకైక పెన్షనర్ల సంఘం అన్నారు. పెన్షనర్లు వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో లక్షల రూపాయల బిల్లులు చెల్లించవలసి వస్తున్నందున 1వ పి.ఆర్.సి. సిఫారసులకు అనుగుణంగా పెన్షనర్ల మూల వేతనము నుండి 1% మినహాయించి పూర్తి స్థాయిలో ఈ హెచ్ ఎస్ అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్ల నుండి కమ్యుటేషన్ ద్వారా పొందిన మొత్తమును 15 సం.ల (180వాయిదాల లో) వరకు మినహాహించబడుచున్నది. ఇది చాలా కాలము క్రితమే చేయబడిన లెక్కల ప్రకారము మినహాయించబడుచున్నది. ప్రస్తుత వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణము, జీవనవ్యయమ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని అట్టి రికవరీ కాలాన్ని 12 సం.లకు తగ్గించాలని  విజ్ఞప్తి చేశారు. రెండవ పిఆర్సి నియమించి 1-7-23 నుండి అమలు పరచి ఐ అర్ చెల్లించులన్నారు.

పెండింగ్ లో ఉన్న  రెండు డిఆర్ లు  చెల్లించలన్నారు. నెలల తరబడి ఇ-కుబేర్ లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతినెలా మొదటి తేదీన పెన్షన్లు తప్పనిసరిగా చెల్లించలని అన్నారు. తెలంగాణ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో 85% పెన్షన్లు సభ్యులుగా ఉన్నందువలన సంఘానికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వ ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మార్పాక సత్యనారాయణ, కార్యదర్శి తనుగుల విజయకుమార్, కోశాధికారి కొమురోజు శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రుపట్ల సుధాకర్ రెడ్డి, ప్రతినిధులు శశికళ, ఖాజా మొహీనుద్దీన్, అవదానుల మోహన్ శర్మ, కొంతం రామ్ కిషన్, చంద్రుపట్ల పాండురంగారెడ్డి, రాంపల్లి ప్రకాష్, వొల్లాల శంకర్ లింగం, రామడుగు మారుతీ రావు, పెండ్యాల తిరుమలయ్య, కుక్కడపు రామయ్య, పోచం, రేపాల సత్యనారాయణ, పురుషోత్తం పల్లి సత్యనారాయణ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.