బీజేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్:బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నాగర్ కర్నూల్ లో కేసిఆర్ ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా… ఇది కేసిఆర్ అడ్డా..ఆయన గురించి మాట్లాడే టప్పుడు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు బిడ్డా అని ఘాటుగా హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు కేంద్రం ఇచ్చిన గణాంకాలు నయా పైసా తో సహా వివరించిన…కుక్క తోక వంకర అన్నట్లు పదే పదె అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్..అది నోరా..డ్రైనేజీ మోరా అని ధ్వజమెత్తారు. వచ్చిన ప్రతిసారీ తెలంగాణ అభివృద్ది మీద విషం చిమ్మే మాటలే చెప్తున్నవ్,గుజరాత్ గులాంలైన ఇక్కడి బీజేపీ నాయకులు రాసిచ్చిన పాత స్క్రిప్ట్ నే ఎన్ని సార్లు చదువుతవ్ అని నిలదీశారు.