పుణె ఆగష్టు 1:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారంనాడు ఒకే వేదకను పంచుకున్నారు. ప్రధాని వేదికపైకి వస్తూనే అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవార్ సైతం నవ్వుతూ తన ప్రతిస్పందన తెలియజేశారు. మహారాష్ట్రలోని పుణెలో మోదీకి ‘లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు’ ప్రదానం సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
శరద్ పవార్ పార్టీ ఇటీవల రెండుగా చీలిన తర్వాత పవార్, మోదీ కలుసుకోవడం ఇదే ప్రథమం.బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య విపక్ష కూటమి ఇండియా ఏర్పాటైన తరుణంలో మోదీ కార్యాలయంలో పవార్ పాల్గొనడం మంచి పరిణామం కాదని విపక్ష నేతలు పవార్‌కు సూచించినప్పటికీ ఆయన మోదీతో వేదికపంచుకోవడం ఆసక్తికరం. అయితే, ఇరువురు నేతలు వేదకపై సుమారు 75 నిమిషాలు ఉన్నప్పటికీ ముఖాముఖీ సంభాషణలు జరపలేదని తెలుస్తోంది.