విమర్శలతో నిజాలను కప్పిపుచ్చలేరు
బిఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్
బీఆర్‌ఎస్ నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సవి•క్షించు కోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్ పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల భంగపాటు తర్వాత లోపం ఎక్కడుందో సవి•క్షించుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై బురద చల్లడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు.
గురువారం గాంధీభవన్‌లో వి•డియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు వి•డియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపితే స్వాగతిస్తాంమని తెలిపారు. నిస్సృహతో కూడిన ప్రకటనలతో గందరగోళాన్ని కప్పిపుచ్చుకోవడం వల్ల ప్రజయోజనం ఉండదని చెప్పారు. జకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. వారి అభిమానం ఉన్నంతకాలమే ఏ రాజకీయ పక్షమైనా కొనసాగుతుందని తెలిపారు. ఇంత జరిగినా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్లు సచివాలయానికి రాకుండా నివాసం నుంచే పాలన సాగించారని ధ్వజమెత్తారు.
కనీసం ప్రతిపక్ష నేతగానైనా ఆయన జనం మధ్యకు వెళ్తారనుకున్నామని కాని ఇంట్లోనే కూర్చుని కార్యకర్తలను తనవద్దకు రప్పించుకుంటున్నారని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ పార్టీ యాదృచ్ఛికంగా అధికారంలోకి వచ్చిందని ఇప్పటికీ ప్రచారం చేస్తుండటం వాళ్ల ఆలోచనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిసిపోతోందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెల్చుకుందని… బీఆర్ ఎస్‌కు దక్కింది 39 మాత్రమే. 25 సీట్ల ఆధిక్యతను మర్చిపోతున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 2019 లో 9 స్థానాలు గెల్చిన ఆ పార్టీ సున్నాకే పరిమితమైందని సెటైర్లు గుప్పించారు. ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదా? అయినా ఓటమితో దిష్టి తొలగిందని సమర్థించు కోవడం ఏంటి? అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు అధికారంలో ఉంటామని గాంభీర్యాలకు పోవడం కలలో జీవించడం కాదా అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఏలోటూ రాకుండా చూసుకుని మళ్లీ మళ్లీ గెలుస్తాం అనడంలో హేతుబద్దత ఉందని తెలిపారు. నేలమట్ట మైన పార్టీని నాలుగున్నరేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి 15 ఏళ్లు నిరాటంకంగా పరిపాలిస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ది తార్కికతకు దగ్గరగా లేని అందమైన ఊహ అనుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.