A place where you need to follow for what happening in world cup

సంక్షేమ హాస్టల్‌లో ఎలుకల స్వైర విహారం

12 మంది బాలికలను కరిచిన ఎలుకలు
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడు తాజా మరో అంశం వెలుగులోకి వచ్చింది.
మెదక్‌ ‌జిల్లాలోని రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. పలువురు విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఈ ఘటనలో 12 మంది అమ్మాయిలను ఎలుకలు కొరకడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఎలుకలు సంచరిస్తూ, నిద్రిస్తున్న సమయంలో తమను కొరుకుతున్నాయని ఇప్పటికే పలుమార్లు ప్రిన్సిపాల్‌కు విద్యార్థినులు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని బిఆర్‌ఎస్‌ ‌నేతలు అంటున్నారు.  వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం ఏర్పడే అవకాశం ఉందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. చికిత్స కోసం బాధిత విద్యార్థులు  ఆస్పత్రికి వెళ్లారు. కాగా ఘటన జరిగిన గదిలో పారిశుధ్యం లోపించిందని..
పనికిరాని వస్తువులన్నీ నిల్వ ఉంచారని ఫలితంగా ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్థినులు చెప్పారు. ఎలుకలతో తాము ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్ ‌కేర్‌టేకర్లు, ఇతర సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థుల తల్లి దండ్రులు  ఆందోళన చేశారు.

Leave A Reply

Your email address will not be published.