హైదరాబాద్:రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం సెక్రటేరియట్ లో తన విధుల్లో పాల్గొన్నారు. సోమవారం సీఎం కేసీఅర్ వెంట మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అయన సూచనల మేరకు నేడు సెకరటేరియట్ లో సాధారణ విధుల్లో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు.
ఈ మేరకు పలుఫైల్స్ పై సంతకాలు చేశారు. రవాణా శాఖలో కొనసాగుతున్న సేవలు, నూతనంగా చేపట్టిన ఆన్లైన్ విధానం తదితర అంశాలపై తన పర్సనల్ సెక్రటరీ కిరణ్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.