విజయవాడ పంజాకు చెందిన అముదాల ప్రకాష్ గా గుర్తింపు
అవనిగడ్డ:పులిగడ్డ కృష్ణానదిలో గల్లంతైన ప్రకాశ్ మృతదేహం సోమవారం లభ్యమైంది.వివరాలు….అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ వద్ద కృష్ణానదిలో విజయవాడ పంజాకు చెందిన ఆముదాల ప్రకాష్ (32) గల్లంతైన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఎస్ఐ రమేష్ అందించిన వివరాలు ప్రకారం విజయవాడకు చెందిన ప్రకాష్, అతని మిత్రుడు మధుసూధన్ వెల్లింగ్ పనులు చేస్తుంటారు. మోపిదేవి వార్పు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద వెల్డింగ్ పని దుర్చుకునేందుకు వచ్చారు.
వారితో మాట్లాడిన అనంతరం ఇంటికి తిరిగి వెళుతుండగా వార్పు డొంకరోడ్డు వద్దకు రాగానే బైక్ పై నున్న ప్రకాష్ అదుపు తప్పి పడిపోవడంతో బట్టలకు బురద అయింది. దుస్తులను శుభ్రం చేసుకునేందుకు దగ్గరలోని పులిగడ్డ కొత్తబ్రిడ్జి సమీపంలో గతంలో కృష్ణానదిలో ఓఎన్టీసీ వేసిన రహదారిపై తూముల వద్ద ప్రకాష్ నదిలోకి దిగి బట్టలు ఉతుక్కున్నాడు అనంతరం స్నానం చేసేందుకు మరోసారి ప్రకాష్ నదిలోకి దిగగా ఆ ప్రాంతంలో ఊబి ఉండటంతో పైకి రాలేక నీట మునిగి పోయాడు.