సిరిసిల్ల లో మంత్రి కెటిఆర్ కలిసేందుకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వర్గీయులు వచ్చారు. అయితే, వారికి మంత్రి సమయం ఇవ్వలేదు. వారితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. వారంతా ఎమ్మెల్యే రమేష్ బాబు కే టికెట్ ఇవ్వాలని కోరేందుకు వచ్చినట్లు సమాచారం.
వేములవాడ బి అర్ ఎస్ పార్టీ లో గత కొంతకాలంగా వర్గ విభేదాలు నెలకొన్నాయి. ఇప్పటికే చల్మెడ లక్ష్మీ నరసంహరావు, ఏనుగు మనోహర్ రెడ్డి వేములవాడ టికెట్ అశిస్తుతున్నారు. – కెటిఆర్ కలిసేందుకు వచ్చిన వారిలో జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ తో పాటు ఎంపిపిలు, జడ్పీటిసి లు వున్నారు. వారిని కలవకుండా మంత్రి కేటీఆర్ వెళ్లిపోవడం చర్చనీయాంశమయింది.