A place where you need to follow for what happening in world cup

మోసం కేసీఆర్‌ ‌నైజం

  • మాట తప్పడం ఆయనకు అలవాటు
  • బిజెపి బి టీం బిఆర్‌ఎస్‌
  • ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే

‌ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌ ‌లక్షణమని  ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ‌ర్యాలీ, గంజ్‌ ‌మైదానంలో సభా జరింగింది. ఈ  సభకు ముఖ్య అథితిగా ఖర్గే హాజరయ్యారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి తప్పిన విషయం మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కానీ, సోనియాగాంధీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పార్టీ సమాధి అవుతున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. కర్ణాట కలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫైవ్‌ ‌గ్యారంటీస్‌ అమల వుతున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌మంత్రులు అను మానాలు రేకెత్తిస్తున్నారని సందేహాలుంటే వచ్చి చూసుకో వచ్చని సవాల్‌ ‌చేశారు. బీఆర్‌ఎస్‌ ఒక్కటే అప్పుల కుప్ప చేశాక మోడీతో ఆయనకు లాలూచీ పడుతున్నారని అన్నారు. రెండూ ఒకే తాను ముక్కలు అని అన్నారు.కర్ణాటకలో హామీలన్నీ అమలవుతున్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ను లగ్జరీ బస్సులో తీసుకెళ్లి చూపిస్తామని అన్నారు.

బీజేపీకి బీఆర్‌ఎస్‌ ‌బీ టీమ్‌ ‌గా ఉన్నదంటున్నారు. కానీ ఆ రెండూ కలిసే పనిచే స్తున్నాయన్నారు. మోడీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్లుగానే కేసీఆర్‌ ‌కూడా గతంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇందిరాగాంధీ గతంలో మెదక్‌ ఎం‌పీగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారానికి వచ్చి హామీ ఇచ్చినట్లుగానే బీహెచ్‌ ఈఎల్‌, ‌బీడీఎల్‌, ఆర్డినెన్స్ ‌ఫ్యాక్టరీలను పెట్టారని, ఇదీ వారు ఒక మాట ఇస్తే నెరవేర్చుకునే మంచి   వ్యక్తిత్వానికి నిదర్శమని ఆన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయన్నారు. ఇవి ఓట్ల కోసం ఇస్తున్నహామీలు కావని, పేదల బతుకుల్లో బాగు కోసం ఇస్తున్న గ్యారం టీలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియాగాంధీ. కాళ్లు మొక్కిన కేసీఆర్‌, అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయి ఇప్పుడు రాహుల్‌  ‌గాంధీ, ప్రియాం కాగాంధీని విమర్శిస్తు న్నారని ఖర్గే మండిపడ్డారు. చివరకు కాంగ్రెస్‌ ‌పార్టీ ఏం చేసిందంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తు న్నారని, కేసీఆర్‌ ‌నిజ స్వరూపం ఇదేనని చురక లంటించారు. రాష్ట్రం ఏర్పడేటప్పుడు మిగులు బడ్జెట్‌ ఉం‌టే తొమ్మిదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్‌ ‌పరిపాలన తీరును విమర్శించారు.

banner 1 photo 1.jpg
కర్ణాటక వెళ్లి ఐదు గ్యారంటీలు అమలు చూద్దాం
-బస్సు రెడీగా ఉంది.. ప్రగతి భవన్‌కు రావాలా.. ఫామ్‌ ‌హౌస్‌కు రావాలా
-సీఎం కేసీఆర్‌ ‌కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌

‌మెదక్‌/‌సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌కేసీఆర్‌ ‌నువ్వో కచరా..నన్ను రేటెంత రెడ్డి అంటావా? రేవంత్‌ ‌రెడ్డిని కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌ ‌పై ఫైరయ్యారు. తెలంగాణను జుమ్మె రాత్‌ ‌బజార్‌ ‌లో అమ్మేసిన నువ్వా నా గురించి మాట్లాడేది అని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

రెండో దశ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం మెదక్‌, ‌సంగారెడ్డిలలో నిర్వహించిన జనసభలలో రేవంత్‌ ‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.  కర్నాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్‌ అయ్యారు. బస్సు రెడీగా ఉంది.. ప్రగతి భవన్‌కు రావాలో.. ఫామ్‌ ‌హౌస్‌కు రావాలో చెప్పండి.. కర్నాటక వెళ్లి ఐదు గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో చూద్దామని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ ‌విసిరారు. కర్నాటకు వచ్చి చూడాలని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌విసిరిన సవాల్‌కు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్‌ ‌పార్టీకి నష్టమని తెలిసినా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ, పదేళ్లు గడిచినా తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్నారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదు. కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. అందుకే సోనియాగాంధీ మరోసారి పూనుకొని తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీ అమలు చేస్తున్న హామీలను చూపిస్తాం. కర్నాటకలో చర్చకు రమ్మని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ‌సవాల్‌ ‌విసిరితే… మంత్రి కేటీఆర్‌ ‌తోక ముడిచారు’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మేడిగడ్డ పై కుట్ర జరిగిందని కేసీఆర్‌ ‌సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..బాంబులు పెడితే ఎక్కడైనా పిల్లర్లు భూమిలోకి కుంగుతాయా? ఆమాత్రం ఆలోచన లేకుండా కేసీఆర్‌ ‌మాట్లాడుతున్నారు అని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొందని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డిసెంబర్‌ 9‌వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని రేవంత్‌ ‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలుసుకుని అటునుంచి కర్ణాటక వెళదామని కేసీఆర్‌ ‌కు రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌చేశారు. ఈ సవాలుకు మీరు సిద్ధమా? అని అడిగారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని.. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని రేవంత్‌ ‌రెడ్డి కోరారు. మైనంపల్లి రోహిత్‌ ‌ను చూస్తోంటే ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుందన్నారు రేవంత్‌ ‌రెడ్డి. రాబోయే ముప్పై ఏళ్లు రోహిత్‌ ‌పేద ప్రజలకు సేవ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు రేవంత్‌ ‌రెడ్డి. సోనియమ్మ తెలంగాణ ఏ ఉద్దేశంతో తెలంగా ఇచ్చారో… ఆ ఉద్దేశం నెరవేరలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు జరగాలన్నారు రేవంత్‌ ‌రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతీ నెలా మహిళలకు రూ.2500, రూ.500 లకే గ్యాస్‌ ‌సిలిండర్‌, ‌రైతు భరోసా ద్వారా ప్రతీ ఏటా రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు..ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం ఇక కేసీఆర్‌ ‌జీవిత కాలం ఫామ్‌ ‌హౌస్‌ ‌లో రెస్ట్ ‌తీసుకోవాల్సిందే అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.