A place where you need to follow for what happening in world cup

ఇస్రో… సముద్రయాన్…

చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతం కావడంతో ప్రపంచదేశాలన్ని భారత్‌ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇటీవల సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్1 ను కూడా విజయంతంగా ప్రయోగించింది. అయితే ఇప్పుడు భారత్ మరో సరికొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. అదే సముద్రయాన్. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులో కీలకమనటుంటి జలంతర్గామి మత్స్య-6000 తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఆ సబ్ మెరైన్ ఫోటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే సముద్ర గర్భ అన్వేషణలో భాగంగా తోడ్పడే మానవ సహిత జలంతర్గామి ఇదేనని పేర్కొన్నారు. అయితే ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇక ఈ ప్రాజెక్టు మొదలైనట్లైతే భారతదేశంలో మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కుతుంది.

సముద్రంలోకి వెళ్లే ఆక్వానాట్‌లను ఆరు వేల మీటర్ల లోతు వరకు తీసుకువెళ్లడానికి ఓ గోళాకార నౌకను నిర్మించనున్నారు. ముందుగా ఇది 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మిషన్ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇక తదుపరి ప్రయాణం సముద్రయాన్. ఇది చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీలో అభివృద్ధి అవుతున్న మత్స్య-6000 జలాంతర్గామి. ఇండియా చేపడుతున్నటువంటి తొలి మానవ సహిత డీప్ ఓషన్ సముదద్రయాన్‌లో భాగంగా దీన్ని తయారుచేస్తున్నారు. అయితే జలాంతర్గామిలో ముగ్గురు కూర్చోని.. సుమారు 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు. దీనివల్ల సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని సైతం అధ్యయనం చేయవచ్చు. అయితే ఈ వ్యవస్థ సముద్ర పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగించదని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

ఇదిలా ఉండగా మరోవైపు.. బ్లూ ఎకనామీని ప్రోత్సహించడంలో భాగంగా భారత్ ఈ డీప్ ఓషన్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఈ సముద్ర గర్భంలో ఇప్పటికే అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే అరుదైన జీవజాలం ఇక్కడ నివాసం ఉంటోంది. వాటిని మనం సమర్థవంతంగా వినియోగించుకున్నట్లైతే.. ఆర్థికాభివృద్ధఇ, నూతన ఉద్యోగాలు సృష్టించేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక జలంతార్గామిలో కూర్చొని పరిశీలనించనటువంటి కిరణ్ రిజిజుకు దాని విశేషాల గురించి అక్కడి నిపుణులు వివరించారు. మరో విషయం ఏంటంటే 2026వ సంవత్సరం నాటికి ఈ మిషన్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గతంలోనే లోక్‌సభలో వెల్లడించారు. ఇక ప్రయోగం విజయవంతమైతే భారత్ మరో చరిత్ర సృష్టించనుంది.

Leave A Reply

Your email address will not be published.