A place where you need to follow for what happening in world cup

టీడీపీ వర్సెస్ వైసీపీ ఫ్లెక్సీ వార్

0 22

చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ, వైసీపీ శ్రేణులు పోటాపోటీ విమర్శలు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. ఆర్టీసీ బస్ స్టాండ్లు, డిపోల వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ బంద్ కు జనసేన మద్దతు తెలిపింది. అయితే టీడీపీ ఆందోళనలను వైసీపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో పలుచోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.చంద్రబాబు అరెస్టుపై టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. వైసీపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నాయి. మంత్రి రోజా చంద్రబాబుకు రిమాండ్ విధించిన వెంటనే తన ఇంటి వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. వైసీపీ తీరును టీడీపీ తప్పుబడుతోంది.

అయితే కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ ఆత్మశాంతించిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, హరికృష్ణ, తారకరత్న మరణాలను వాడుకుని చంద్రబాబు రాజకీయాలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ ఆత్మశాంతి రోజు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఇందులో హరికృష్ణ, జూ.ఎన్టీఆర్ సీఎం జగన్ కు పుష్పగుచ్ఛం ఇస్తున్నట్లు ఫొటో పెట్టారు. అయితే జగ్గయ్యపేటలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఫ్లెక్సీ పెట్టారు. ఇందులో బాబాయ్ ను హత్యచేసింది ఎవరు? అమ్మను, చెల్లిని పార్టీ నుంచి తరిమేసింది ఎవరు? ఈడీ, సీబీఐ కేసులోల్ ఏ1 ఎవరు? అంటూ సీఎం జగన్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.గుంటూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు జనసేన మద్దతు తెలపడంతో… ఆ పార్టీ శ్రేణులు గుంటూరులో బంద్ పాటిస్తున్నాయి.

అయితే వైసీపీ నేతలు బంద్ చేస్తున్న షాపులను తిరిగి ఓపెన్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు మేయర్ పోలీస్ లాఠీతో హాల్ చల్ చేశారు. అరండల్ పేటలో మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి గిరి బంద్ చేస్తున్న షాపులను తిరిగి ఓపెన్ చేయిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా, ఇరు వర్గాలకు ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో మేయర్ కావటి మనోహర్ పోలీసుల లాఠీ తీసుకుని జనసేన నేతలపై దాడికి పాల్పడ్డారు.

పోలీసులు తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు వారిని అరెస్టు చేశారు.చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌పై టీడీపీ నేతలు గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారువిశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో గవర్నర్ ను టీడీపీ నేతలు కలిశారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు… రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబును మానసికంగా కృంగదీసేందుకు 48 గంటల పాటు పలు ప్రాంతాల్లో తిప్పుతూ డ్రామా నడిపారని ఆరోపించారు. ఎన్ని చేసినా చంద్రబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని అంతిమంగా న్యాయపోరాటంలో చంద్రబాబే విజయం సాధిస్తారన్నారు. టీడీపీకి ఇలాంటి సమస్యలు కొత్తేమీ కాదన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Epaper

X