విపక్ష కూటమికి ‘ఇండియా’ పేరును ఎవరు సూచించారో తెలుసా? ఈ పేరుకు నితీశ్ కుమార్ ఎందుకు అభ్యంతరం తెలిపారు?
- యూపీఏ నుంచి INDIAగా మారిన విపక్ష కూటమి పేరు
- ఈ పేరుపై అభ్యంతరం తెలిపిన నితీశ్ కుమార్
- ఈ పేరును మమతా బెనర్జీ సూచించాన్న తిరుమలవాసన్
విపక్ష పార్టీల కూటమికి పేరు మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు యూపీఏగా ఉన్న కూటమి పేరు ఇప్పుడు INDIAగా మారింది. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పేరుపై బీహార్ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. కూటమి పేరును INDIAగా ఎలా పెడతారని ఆయన పశ్నించారట. INDIA, NDA పదాలను పలికినప్పుడు… రెండూ ఒకేలా అనిపిస్తాయని కూడా ఆయన అన్నారట. అయితే మరో నేత ఆయనను కన్విన్స్ చేయడంతో, చివరకు ఆయన కూడా ఓకే చెప్పారట.
మరోవైపు INDIA పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారట. ఈ విషయాన్ని విడుత్తలై చిరుతైగల్ కట్చి చీఫ్ తిరుమలవాసన్ వెల్లడించారు. ఈ పేరును తొలుత మమత సూచించారని… ఆ తర్వాత దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని… చివరకు అందరూ ఈ పేరుకు ఆమోదం తెలిపారని అన్నారు.