మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నం
ప్రయోజనం అదానీ..అంబానీలకే
సామాన్యుడికి లభించని ఉపశమనం
కాపీ పేస్ట్ బడ్జెట్…కాంగ్రెస్ మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టే యత్నం
బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ పెదవి విరుపు
కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే, తదితరుల విమర్శలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ తన మిత్రపక్షాలను సంతోషపెట్టేలా ఉందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలను పణంగా పెట్టి.. బడ్జెట్‌లో తమ మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు చేశారని ఆయన మండిపడ్డారు. తన స్నేహితులను సంతోష పెట్టడం కోసమే ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారని..దీని నుంచి అదానీ, అంబానీ ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా సామాన్య భారతీయుడికి ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పారు. ఇదొక కాపీ పేస్ట్ బడ్జెట్ అని..కాంగ్రెస్ మేనిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టారని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ తరహాలోనే.. దీనిని ఓ కాపీ పేస్ట్ బడ్జెట్‌గా అభివర్ణించారు. ఈ మోదీ ప్రభుత్వ కాపీక్యాట్ బడ్జెట్.. కాంగ్రెస్ న్యాయ అజెండాను కూడా సరిగ్గా కాపీ చేయలేకపోయిందని ఖర్గే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కూటమి భాగస్వాములను మోసం చేసేందుకు, ఎన్డీఏ మనుగడ సాగిచేందుకు మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అరకొర డబ్బులు పంచుతోందని ఆరోపించింది. ఇది దేశ ప్రగతికి ఉద్దేశించిన బడ్జెట్ కాదని.. మోదీ ప్రభుత్వాన్ని కాపాడే బడ్జెట్ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా ఇదొక కాపీక్యాట్ బ్జడెట్ అని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలను సెటైరికల్ కామెంట్ చేశారు. అప్రెంటిస్‌షిప్ పథకాన్ని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 11వ పేజీ నుంచి తీసుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కాపీ కొట్టిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేతలు శశిథరూర్, పి.చిదంబరం అన్నారు. తమ మేనిఫెస్టో నుంచి నిర్మలా సీతారామన్ ’అప్రంటీస్ స్కీమ్’ను కాపీ కొట్టారని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. నిర్మలా సీతారామన్ ’ఇంటెర్న్‌షిప్ స్కీమ్’ను ప్రకటించారు. ఈ స్కీమ్ కింద ఫార్మల్ సెక్టార్‌లో ఫస్ట్‌టైమ్ ఉద్యోగులకు ఒక నెల వేతనం లభిస్తుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు 500 టాప్`కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టే`2024ను ఆర్థిక మంత్రి చదివారని, అందుకు ఆమెను అభినందిస్తున్నానని పి.చిదంబరం సామాజిక మాధ్యమం ’ఎక్స్’లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెన్టివ్ (ఇఒఎ)ను నిర్మలా సీతారామన్ బ్జడెట్‌లో చేర్చడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్`11లో చెప్పిన ’ఎంప్రటీస్ స్కీమ్’ను కూడా ఆర్థిక మంత్రి బ్జడెట్‌లో ప్రవేశపెట్టారని చెప్పారు. కాంగ్రెస్ మరికొన్ని ఐడియాలను కూడా బ్జడె?ట్‌లో చేర్చారని ఆయన తెలిపారు. అయితే బ్జడెట్‌లో ’ఏంజెల్ టాక్స్’ను నిర్మలా సీతారామన్ రద్దు చేయడాన్ని ఆయన అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా ’ఏంజెల్ టాక్స్’ను రద్దు చేయాలని కోరుతోందని, కాంగ్రెస్ మేనిఫెస్టో 31వ పేజీలో కాంగ్రెస్ ఇచ్చిన హావిూ ఇదని చెప్పారు. కాగా, సామాన్య ప్రజానీకం సమస్యలపై బ్జడెట్‌లో పరిష్కారం కనిపించలేదని శశిథరూర్ పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ ఊసే లేదన్నారు. ఆదాయ అసమానతల పరిష్కారానికి బ్జడెట్‌లో చేసింది కూడా చాలా తక్కువ అని అన్నారు. ఏంజెల్ ఇన్వెస్టర్లపై పన్ను రద్దు చేయడాన్ని మాత్రం తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.