- సీతానగరంలో ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన ఇద్దరు మహిళలు
- అదే సమయంలో ఉండవల్లి నుంచి పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు
- బాధితులకు చికిత్స చేయించి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు చంద్రబాబు తన కాన్వాయ్ లోని డాక్టర్ తో చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళ్తే, సీతానగరంలో ద్విచక్రవాహనం నుంచి ఇద్దరు మహిళలు పడిపోయారు. ఇదే సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు ప్రమాదానికి గురైన మహిళలను గమనించి కాన్వాయ్ ను ఆపించారు. కారు దిగి గాయపడ్డ మహిళల వద్దకు వచ్చారు.
తన కాన్వాయ్ లో ఉన్న డాక్టర్ తో చికిత్స చేయించారు. బాధిత మహిళలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కాన్వాయ్ లోని ఒక కారులో బాధితులను వారి ఇంటి వద్ద దించి, వారికి కావాల్సిన మందులను ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తో బాధితుల బంధువులకు ఫోన్ చేయించారు. అనంతరం బాధితులను వాహనంలో పంపించి, ఆయన అక్కడి నుంచి పార్టీ ఆఫీస్ కు బయల్దేరారు.